నేను రిలేషన్ లో ఉన్నది తనతోనే… మరోసారి క్లారిటీ ఇచ్చేసిన శ్రీజ!

శ్రీజ కొణిదెల ఈమె ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ తన వ్యక్తిగత విషయాల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా శ్రీజ పెళ్లి విడాకుల విషయం గురించి రోజు సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే గత రెండు రోజుల క్రితం ఈమె 2022వ సంవత్సరాన్ని గుర్తు చేసుకుంటూ చేసినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఈమె మూడో పెళ్లి చేసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ విధంగా శ్రీజ పోస్ట్ చేస్తూ 2022 తనకు ఒక అద్భుతమైన వ్యక్తిని కలిసేలా చేసింది. కష్టసుఖాల్లో తన తోడు ఉంటూ తనని ముందుకు నడిపిస్తున్న ఆ వ్యక్తితో కలిసి కొత్త ప్రయాణం మొదలు పెడుతున్న అంటూ ఈమె చేసిన పోస్ట్ మూడో పెళ్లి చేసుకోబోతుందని అర్థం వచ్చేలాగే ఉంది.దీంతో శ్రీజ మూడో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసిందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.అయితే ఈమె ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది ఏంటి అనే విషయాల గురించి చర్చలు మొదలవుతున్న తరుణంలో శ్రీజ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తాను ఎవరితో రిలేషన్ లో ఉన్నాననే విషయాన్ని తెలియజేశారు.

ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా మరోసారి పోస్ట్ చేస్తూ తాను తనతోనే రిలేషన్ లో ఉన్నానని చెప్పుకొచ్చారు.ఇలా సెల్ఫ్ రిలేషన్ లో ఉన్నానని తనతో తానే కొత్త జీవితం మొదలుపెట్టబోతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఇలా శ్రీజ చేసిన ఈ పోస్ట్ వైరల్ కావడంతో తన మూడో పెళ్లి గురించి వస్తున్న వార్తలను పరోక్షంగా ఖండించారని చెప్పాలి. మొత్తానికి శ్రీజ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.