Sreeja: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్న చిరంజీవి ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరిస్తున్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న చిరంజీవికి వ్యక్తిగతంగా మాత్రం కొంత నిరాశ ఉందనే చెప్పాలి. ముఖ్యంగా తన చిన్న కుమార్తె శ్రీజ విషయంలో చిరు నిత్యం బాధపడుతూ ఉంటారని తెలుస్తోంది. చిరంజీవికి ముగ్గురు సంతానం కాగా సుస్మిత చరణ్ ఇద్దరు కూడా వారి జీవితంలో సక్సెస్ అయ్యి ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ శ్రీజ జీవితంలో మాత్రం ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి.
శ్రీజ కాలేజీ చదువుతున్న సమయంలోనే శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి ఇంట్లో వారికి తెలియకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. అయితే ఒక బిడ్డ పుట్టిన తర్వాత శిరీష్ భరద్వాజ్ తో వచ్చిన అభిప్రాయ బేధాల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు.
ఇలా భర్త నుంచి విడిపోయిన తన కుమార్తెను మెగాస్టార్ చిరంజీవి చేరదీశారు. ఇలా తన బిడ్డ మనవరాలు ఆలనా పాలన చూసుకుంటూ ఉన్న ఈయన తన సమీప బంధువు అయిన కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి శ్రీజ వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపించారు. ఇక ఈ దంపతులకు మరో చిన్నారి జన్మించింది అయితే వీరి వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది అనుకున్న క్రమంలో వీరిద్దరూ కూడా విడాకులు తీసుకుని విడిపోయారు.
ఇలా శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి తన ఇద్దరు భర్తల నుంచి విడాకులు తీసుకొని విడిపోయింది అయితే ప్రస్తుతం తన తండ్రి వద్దే ఉంటున్న ఈమె మూడో పెళ్లి చేసుకోలేదు అయితే ఇలా చిరంజీవి తిరిగి తన బిడ్డకు పెళ్లి చేయకపోవడానికి కారణం ఏంటి అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు చిరంజీవికి వేలకోట్లు ఆస్తి ఉన్న తన బిడ్డ మాత్రం ఒంటరిగా గడపటానికి కారణం లేకపోలేదు.
శ్రీజ జాతకం ప్రకారం తనకు పెళ్లి కలిసి రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీ జాతకం పండితులకు చూయించిన తర్వాత వారు ఈమెకు పెళ్లి కలిసి రాదని చెప్పిన అనంతరమే తన కుమార్తెకు మూడో పెళ్లి చేయాలనే నిర్ణయాన్ని చిరంజీవి వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది.లేకపోతే చిరంజీవికి ఉన్న ఫేమ్ కి డబ్బుకి పలుకుబడికి శ్రీజకి మూడో పెళ్లి చేయడం పెద్ద విషయం ఏం కాదనే చెప్పాలి..