Hyper Aadi: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైపర్ ఆది ఏ షో అయిన వేదికపై ఉన్నారంటే తప్పనిసరిగా అక్కడ నవ్వుల సునామి సృష్టిస్తాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాదికి గుడ్ బై చెబుతూ వచ్చే ఏడాదికి స్వాగతం పలుకుతున్న సందర్భంగా పెళ్ళాం వద్దు- పార్టీ ముద్దు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ కార్యక్రమానికి సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా రావడంతో ఈ కార్యక్రమం మరింత సందడిగా నెలకొంది. ఇక ప్రోమోలో హైపర్ ఆది యాంకర్ రష్మి డ్రెస్ పై తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరిని నవ్వించారు. ముందుగా రష్మీ ఫుల్ లెంత్ నెట్టెడ్ ఫ్రాక్ తో వేదిక పైకి వచ్చింది. ఇక వేదికపైకి వచ్చిన రష్మీ మాట్లాడుతూ ముందు మీరు వచ్చి నా డ్రెస్ సెట్ చేయండి అని అనడంతో రష్మి మాటలకు హైపర్ ఆది తనదైన శైలిలో తన పై పంచులు వేసాడు. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ..
ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు టెంట్ ఎగిరిపోయిందన్నారు. అది ఇక్కడ ఉందా? అంటూ రష్మీ డ్రెస్ పై ఆది తనదైన స్టైల్ లో సెటైర్ వేసాడు. అలా తన గురించి పంచ్ వేస్తూ తన డ్రస్ టచ్ చేసిన హైపర్ ఆది ఇక ఈ రోజు మా స్కిట్ ఈ టెంట్ లో చేసుకోవచ్చు అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆది పంచ్ కి పగలబడి నవ్వారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.