జబర్దస్త్ ఎంట్రీ పై మౌనం వహించిన ఆది… జబర్దస్త్ కు గుడ్ బై చెప్పినట్టేనా?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత కొన్ని వారాల నుంచి హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు.ఈ విధంగా హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి దూరం కావడానికి గల కారణం ఏమిటి అనే విషయం ఇప్పటికే ఆది తెలియజేయలేదు. అయితే ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో చేస్తున్నారు.

తాజాగా ఈ కార్యక్రమంలో విడుదలైన ప్రోమోలో భాగంగా హైపర్ ఆది తనపై తానే సెటైర్లు వేసుకున్నట్లు తెలుస్తోంది.ఎప్పటిలాగే హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో టిక్ టాక్ భాను ఆది పక్కన కనిపించి సందడి చేశారు. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగానే ఆది భానుతో కలిసి శోభనానికి రెడీ అవుతారు. అయితే అనుకోని విధంగా ఈ కార్యక్రమం వాయిదా పడటంతో నిరుత్సాహ పడ్డారు. ఈ క్రమంలోనే సీరియల్ నటి శ్రీ వాణి భర్త వేదికపైకి ఎంట్రీ ఇచ్చి హైపర్ ఆది పై సెటైర్లు వేశారు.

ఈ క్రమంలోనే విక్రమ్ మాట్లాడుతూ నువ్వు ఎప్పుడైతే జబర్దస్త్ కార్యక్రమానికి ఎంట్రీ ఇస్తావో అప్పుడే నీ శోభనం జరుగుతుంది అంటూ హైపర్ ఆదికి కండిషన్ పెడతారు. ఈ విధంగా విక్రమ్ కండిషన్లు పెట్టడంతో హైపర్ ఆది అది జరగదేమో అన్నట్టుగా దాన్ని పక్కకి తప్పించాడు. అలా తన మీద సెటైర్ వేసినా కూడా రియాక్ట్ అవ్వలేదు. ఈ విధంగా హైపర్ ఆది జబర్దస్త్ ఎంట్రీ మౌనంగా ఉండడంతో ఎంతోమంది హైపర్ఆది నిజంగానే ఈ కార్యక్రమానికి గుడ్ బై చెప్పినట్లేనా అనే సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.