ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్ నగరంలో ఆటో నడవవు. ఆటో చార్జీలు పెంచాలని కోరుతూ పలు ఆటో సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. సీఎన్జీతో నడిచే 20 వేల కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్, క్యాబ్ యూనియన్స్ జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నగరంలో 8 ఏళ్లుగా చార్జీలు పెంచకపోవడంతో ఆటోడ్రైవర్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. ఆటో మీటర్ చార్జీలు కనీసం రూ.40.., కిలో మీటర్‌కు రూ. 25 చొప్పున పెంచాలని కోరారు. వృద్ధాప్య పించన్లు, ఆటో కొనుగోలుకు వడ్డీ లేని రుణం, వారి పిల్లల చదువులకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఏపీలో ఇస్తున్నట్లుగా ప్రతి ఆటో డ్రైవరుకూ రూ.10 వేలు ఇవ్వాలని అన్నారు ఆటో సంఘాలు డిమాండ్ చేశాయి.