హైద‌రాబాదీ ఛాయ్ అడ్డా ప్రాంఛైజీ మేళాకి విశేష స్పందన..

యువ‌త‌ను ఎంట‌ర్ ప్రైన‌ర్స్ గా మార్చేందుకు అభిన‌వ్ స‌ర్కార్ ఏర్పాటు చేసిన హైద‌రాబాదీ ఛాయ్ అడ్డా ప్రాంఛైజీ మేళా లో చాలా మంది యువత పాల్గొన్నారు వారి తో పాటు చాలామంది సినీ తారలు మరియు సినిమా యాక్టర్స్ తో పాటు ముఖ్య అతిధిగా గ‌జ‌ల్ శ్రీనివాస్  పాల్గొని యువ‌త‌ను ఎంట‌ర్ ప్రైన‌ర్స్ గా మార్చేందుకు అభిన‌వ్ సర్దార్ చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌ని    అన్నారు.

నగరంలో నిర్వ‌హించిన  హైద‌రాబాదీ ఛాయ్ అడ్డా ప్రాంఛైజీ మేళా చాలా ఆకట్టుకుంది. హైదరాబాదీ చాయ్ అడ్డా చైర్మన్ అభినవ్ సర్ధార్ మాట్లాడుతూ ఈ రోజుల్లో ఎంతో మంది బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు. జాబ్ కన్నా.. సొంత వ్యాపారం చేయడం మేలని భావిస్తున్నారు. కాని ఇనెస్ట్‌మెంట్‌ లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ చాయ్ అడ్డా సొంతంగా వ్యాపారం చేయాలన్న యువతకి మేము తక్కువ పెట్టుబడితోనే మా ప్రాంఛైజీ అందిస్తున్నాము అని తెలిపారు.