గ్రేటర్ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి, ఈ రోజు సాయంత్రానికి పోలింగ్ పూర్తి కాబోతుంది, నాలుగో తేదికి ఫలితాలు వెల్లడించబోతున్నారు, ఇక ఈ గ్రేటర్ లో పోరు ప్రధానంగా తెరాస మరియు బీజేపీ మధ్యనే జరిగింది. ఇరు పార్టీలు కూడా తమ శక్తికి మించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయి, అయితే బీజేపీ పార్టీ ఒక విషయంలో బాగా వెనకబడినట్లు కనిపిస్తుంది. జనసేన పార్టీ మద్దతును గ్రేటర్ లో సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయానే మాటలు వినిపిస్తున్నాయి.
ఆ ఇద్దరే ఇందుకు బాధ్యులు..?
గ్రేటర్ పరిధిలో జనసేన పార్టీ ఎన్నికల నుండి తప్పుకొని బీజేపీకి మద్దతు ఇచ్చింది. స్వయంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసైనికులు అందరు బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరటం జరిగింది, కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం జరిగింది, దానికి కారణం జనసైనికులను బీజేపీ నేతలు అవమానించటమే, నిన్నటి అమిత్ షా రోడ్ షో సందర్భంగా బిజెపి జెండాలతో సమానంగా జనసేన జెండా లు ఎగురుతున్న వీడియో లతోపాటు, జనసైనికుల ని జెండాలు తీసివేయమని బండి సంజయ్ గదమాయిస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేవిధంగా ధర్మపురి అరవింద్ ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ, జనసేన ని విరమింప చేసుకోమని బీజేపీ కోర లేదని, పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా విరమించుకున్నారని వ్యాఖ్యలు చేశారు. దీనితో జనసైనికులు ఇగో ఘోరంగా దెబ్బతింది.
దుబ్బాకలో అలా .. గ్రేటర్ లో ఇలా
బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత దుబ్బాకలో ఎన్నికలు జరిగాయి, ఈ ఎన్నికల సమయంలో బీజేపీ కార్యకర్తల కంటే ఎక్కువగా జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో యమా యాక్టీవ్ గా పనిచేసారు, జనసేనకు ఉన్న సోషల్ మీడియా బలాన్ని దుబ్బాకలో బాగా ఉపయోగించారు, కానీ గ్రేటర్ పరిధికి వచ్చేసరికి జనసైనికులు ఎక్కడ కూడా బీజేపీకి మద్దతు గా సోషల్ మీడియా ప్రచారం నిర్వహించలేదు. గ్రేటర్ ఎన్నికల్లో మొదటిగా జనసేన 18 స్థానాల్లో పోటీచేస్తుందని ప్రకటించారు, ఆ తర్వాత కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత పూర్తిగా ఎన్నికల నుండి పవన్ కళ్యాణ్ తప్పుకున్నాడు, దీనితో తాము పోటీచేయకుండా బీజేపీ అడ్డుపడిందనే భావన జనసైనికుల్లో ఏర్పడింది.
ఓటు వేస్తే టిఆర్ఎస్ కు లేకపోతే నోటాకు
బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ ను పైకి రానివ్వకుండా పధకం ప్రకారమే ఎన్నికల నుండి తప్పించారని, ఆ తర్వాత పవన్ ఢిల్లీ వెళ్లిన కానీ అక్కడ సరైన గౌరవం లభించలేదని, అదే విధంగా తిరుపతి బై ఎలక్షన్స్ లో జనసేనకు అవకాశం ఇచ్చే ఉద్దేశ్యం బీజేపీకి లేన్నట్లు తెలియటంతో జనసైనికులు బీజేపీ పట్ల కోపంతో ఉన్నారు, తెలంగాణలో తెరాస పార్టీ పట్ల జనసేన కార్యకర్తల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే కానీ, బీజేపీ మీద ఉన్న కోపంతో గ్రేటర్ ఎన్నికల్లో తెరాస కు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఒక వేళా తెరాసకు వేయకపోయిన ఆ ఓటు నోటా కు వేయటానికి జనసైనికులు సిద్ధంగా ఉన్నారే కాని బీజేపీకి వేయటానికి మాత్రం సానుకూలంగా లేరని తెలుస్తుంది.
జనసేనకు గ్రేటర్ లో తక్కువ ఓటు శాతమే ఉండవచ్చు కానీ, మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ అనేది కేవలం పదుల సంఖ్యలోనే ఉంటుంది, కాబట్టి ప్రతిఓటు కూడా చాలా కీలకం. అలాంటి ఓట్లను బీజేపీ చేజేతులా దూరం చేసుకుంది. ఆ ప్రభావం ఖచ్చితంగా ఎన్నికల ఫలితాల్లో కనిపించటం ఖాయం