Crime News: శివరాత్రికి సాధారణంగా భక్తులు ఉపవాస జాగరణలు చేయడం మనకు తెలిసిందే అయితే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాలనే నియమం అయితే ఏమాత్రం లేదు ఎవరి ఇష్టం ప్రకారం వారు స్వామి వారికి ఉపవాసం జాగరణ చేయవచ్చు కానీ శ్రీకాకుళం జిల్లా రూరల్ పరిధిలోని సానివాడ గ్రామంలో నివసిస్తున్న నవీన్ కళ్యాణి దంపతుల విషయంలో ఈ ఉపవాస విషయమే తీవ్ర గొడవలకు దారి తీసింది.
2015లో నవీన్ కల్యాణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నవీన్ కు తన సోదరి అంటే ఎంతో ప్రేమ తన అక్క ఏం చెప్పినా అదే కరెక్ట్ అని చెప్పే వ్యక్తిత్వం కలవాడు నవీన్. ఈ క్రమంలోనే నవీన్ సోదరి తన భార్య కల్యాణికి శివరాత్రి రోజు ఉపవాసం ఉండి పూజ చేయాలని సూచించింది. అయితే తన ఆడపడుచు చెప్పిన మాటలను ఏమాత్రం లెక్క చేయకుండా కల్యాణి తన పని తాను చేసుకుంది. తను చెప్పిన మాట పెడచెవిన పెట్టిందని నవీన్ సోదరి తన గురించి నవీన్ కి చెప్పడంతో నవీన్ ఎంతో ఆగ్రహంతో ఊగిపోయాడు.
అక్క చెప్పిన విధంగా ఉపవాసం ఉంటే నష్టం ఏంటి అంటూ తన భార్యను నిలదీశాడు. ఉపవాసం ఉండటం తనకు ఇష్టం లేదంటూ కళ్యాణి మాట్లాడింది. ఇలా వీరిద్దరి మధ్య మాటలు పెరగడంతో నవీన్ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనుకున్న కల్యాణి మొహం పై తలదిండు పెట్టి తన ఊపిరి ఆడకుండా చేసి తనని చంపాడు.అయితే స్వయంగా తన భార్య చనిపోవడంతో నవీన్ పోలీసులకు లొంగిపోయాడు. కళ్యాణి హత్యలో తన సోదరి ప్రమేయం కూడా ఉందని కళ్యాణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.