27 ఏళ్లకే 70 ఏళ్ల వృద్ధురాలు కనిపిస్తున్నా మహిళ.. నాలుగేళ్లుగా ఒకే రూమ్ లో బంధించి చివరికి..?

మహిళల కోసం ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తెచ్చినా కూడా మహిళలపై జరుగుతున్న దాడులు ఆగడం లేదు. కొందరు మహిళలు వారికీ జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారు. ఇలాంటి మహిళలూ మన సమాజంలో ఎంతోమంది ఉన్నారు. మహిళలను మానసికంగా,శారీరకంగా హింసించే మృగాలను ఈ ప్రభుత్వాలు తీసుకు వచ్చిన చట్టాలు ఏం చేయలేకపోతున్నాయి. ఇప్పుడు తెలుసుకోబోయే సంఘటన కూడా అలాంటిదే. ఇప్పుడు మనం తెలుసుకోబోయే బాధితురాలి పరిస్థితి చూస్తే ఎలాంటివారైనా కన్నీరు పెట్టాల్సిందే. పూర్తి వివరాల్లోకి వెళితే..

గ్వాలియర్‌లోని రామ్‌జీ ప్రాంతంలో నివసించే సోనియా అనే యువతి తన ప్రాణం కోసం పోరాడుతోంది. 27 సంవత్సరాల వయస్సు ఉన్న ఆమె 70 సంవత్సరాల వయస్సులో ఉన్నట్టు కనిపించడానికి కారణం ఆమె అత్తమామలు. ఆ మహిళను వరకట్న వేధింపులతో హింసించి ఆమెకు ఇలాంటి గతి పట్టడానికి కారణమయ్యారు.సోనియా 2018 జనవరిలో గ్వాలియర్‌లో గల్ఫామ్ ఖాన్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వరకట్నం కానుకగా అతడికి బైక్ ని బహుమతిగా ఇచ్చారు. పెళ్లి తర్వాత అతను ఆ బైకు బైకును అమ్మేసి సోనియాని తన పుట్టింటికి వెళ్లి కారు తీసుకురావాలని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలోనే ఆమెను హింసించడం కొట్టడం మొదలు పెట్టాడు. అలా గదిలో బంధించి కేవలం ఇంటి పనుల కోసం మాత్రమే ఆమెను బయటికి పంపేవాడు. ఆమెను ఆ తర్వాత మళ్లీ గదిలో వేసి తాళం వేసేవారు. ఇలా దాదాపు నాలుగు సంవత్సరాలుగా సోనియాని వేధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోనియా కు,కొడుకు,కూతురు కూడా పుట్టారు. చిత్రహింసల కారణంగానే ఆమె క్షయ వ్యాధికి గురి అయి కూడా సోనియా భర్త ఆమెను హాస్పిటల్ కు తీసుకు వెళ్ళకుండా తాంత్రికుడు అయినా బాబా హకీమ్ కి చూపించేవాడు. అలా మెల్లగా ఇక మెల్లగా సోనియాకు టీబీ వ్యాధి చివరి దశకు చేరుకుంది. 27 ఏళ్ల వయసులో ఉన్న ఆమె 70 ఏళ్ల మహిళల కనిపిస్తోంది. ఒక సారి సోనియా భర్త బయటకు వెళ్ళినప్పుడు ఆమె తన తల్లికి సమాచారాన్ని అందించింది. వెంటనే సోనియా తల్లి ఆమెను తన పుట్టింటికి తీసుకుని వెళ్ళిపోయింది.అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు వివరించింది. పోలీసులు సోనియా భర్త పై వరకట్న వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆమె తల్లిదండ్రులు తన బిడ్డ ఆరోగ్యం కోసం ఎదురుచూస్తున్నారు.