ఆ సినిమా వల్ల మహేష్ బాబుపై పోలీస్ కేస్.. అసలేం జరిగిందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడానికి మహేష్ బాబు అస్సలు ఇష్టపడరని ఇండస్ట్రీలో పేరుంది. అయితే చాలా సంవత్సరాల క్రితం పోలీస్ కేసు ద్వారా మహేష్ బాబు వార్తల్లో నిలిచారు. తన తప్పేం లేకపోయినా మహేష్ బాబుపై అప్పట్లో పోలీస్ కేసు నమోదు కావడం గమనార్హం. ఇండస్ట్రీ పెద్దలలో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ ఒక సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

అర్జున్ సినిమా పైరసీ జరిగిందని తెలిసి మహేష్ బాబు అప్పట్లో వరంగల్ వెళ్లి ఆ సీడీని పట్టుకున్నారు. అయితే వాళ్లు మహేష్ బాబుపై రివర్స్ లో కేసు పెట్టడంతో మహేష్ బాబు కొన్నేళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ సమయంలో మహేష్ బాబుకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చారు. పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీ ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయలు నష్టపోతున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలపై కూడా పైరసీ తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది.

ఓటీటీలకు కూడా పైరసీ వల్ల ఆదాయం గణనీయంగా తగ్గుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పైరసీ వెబ్ సైట్ల నిర్వాహకులను పట్టుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైరసీని కంట్రోల్ చేయడం సులువు కాకపోయినా పోలీసులు తలచుకుంటే కష్టమైతే కాదు. పెద్ద సినిమాలు రిలీజైన కొన్ని గంటల్లోనే పైరసీ రూపంలో సినిమా అందుబాటులోకి వస్తోంది.

ఎక్కువ టికెట్ రేట్ పెట్టి థియేటర్ లో చూడటం కంటే అతి తక్కువ ఖర్చుతో పైరసీలో సినిమా చూడవచ్చని కొంతమంది భావిస్తున్నారు. సినిమాలపై పైరసీ ఎఫెక్ట్ పడకుండా ఉంటే సినిమాల కలెక్షన్లు మరింత పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు. మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మహేష్ భవిష్యత్ ప్రాజెక్ట్ లతో సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.