Crime News: అధిక ఆదాయం ఆశ చూపించి షేర్ మార్కెట్ లో భారీగా పెట్టుబడులు.. కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కిలాడి దంపతులు..!

Crime News: ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పీతలు చేసేవారు కూడా తమ తెలివిని ప్రదర్శిస్తూ జనాలను మోసం చేస్తున్నారు. కష్టపడి పని చేయడానికి బద్దకించి ఈజీ గా డబ్బులు సంపాదించడం కోసం ఇలా అడ్డదారులు తొక్కుతూ నేరాలకు పాల్పడుతున్నారు.ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక లాభాల కోసం షేర్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇదే అదునుగా భావించిన ఇద్దరు కిలాడి దంపతులు ప్రజలను నమ్మించి అధిక మొత్తంలో డబ్బు ఆశ చూపించి కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. ఇటీవల ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేష్మి రవీంద్రన్‌ నాయర్, బిజ్జు మాధవన్‌లు భార్యాభర్తలు కేరళ రాష్ట్రంలోని కొచ్చి జిల్లా ఎర్రకులంలో నివాసం ఉంటున్నారు. బాగా జల్సాలకు అలవాటు పడిన ఈ జంట సులభంగా డబ్బు సంపాదించే ఉద్దేశంతోషేర్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని స్థానికులను నమ్మబలికారు. పీవీఆర్‌ కన్సల్టెన్సీ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరున బోగస్‌ సంస్థను ఏర్పాటు చేసి వివిధ పట్టణాలలో ప్ ప్రతినిధులను ఏర్పాటు చేశారు.

ప్రజలకు నమ్మకం కలగడానికి మొదటగా పెట్టుబడులు పెట్టిన వారికి భారీ స్థాయిలో కమీషన్లు అందజేశారు. ప్రజలకు నమ్మకం కలిగే భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. అకౌంట్లలో భారీస్థాయిలో డబ్బు జమ అయిన తర్వాత ఆ డబ్బులు డ్రా చేసుకుని ప్రజలకు కనిపించకుండా ఉడాయించారు. ఇలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి మోసపోయిన వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించారు.సైబర్‌ క్రైంతో పాటు సుబేదారి పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి డిల్లీ లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారి దగ్గర నుండి భారీ మొత్తంలో డబ్బు, నగలు , 2 లాప్ టాప్ లు,8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.