నెల సంపాదన ఎంతంటూ యాంకర్ రవిని ప్రశ్నించిన.. రవి సమాధానం ఇదే?

బుల్లితెర మేల్ యాంకర్లలో ఒకరైన యాంకర్ రవి తన అద్భుతమైన వాక్చాతుర్యంతో బుల్లితెర కార్యక్రమాల్లో యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే రవి ప్రస్తుతం బుల్లితెర స్టార్ యాంకర్ గా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా ప్రత్యేక వేడుకలో కూడా రవి సందడి చేస్తుంటారు. ఇకపోతే తాజాగా ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం మొదట్లో రవి టైటిల్ గెలుస్తారని భావించినప్పటికీ ఈయన బిగ్ బాస్ హౌస్ లో భారీగా డ్యామేజ్ సొంతం చేసుకుని బయటకు వచ్చారు.

బయటకు వచ్చిన తర్వాత రవి తన కూతురు భార్య గురించి నెగిటివ్ కామెంట్లు చేసిన వారి పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.ఇలా తన ఫ్యామిలీ గురించి వచ్చే కామెంట్లను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ కుటుంబం పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తున్నారు. ఇక రవికి ఏ మాత్రం ఖాళీ సమయం దొరికిన వెంటనే కుటుంబంతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే తాజాగా రవి తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే తాజాగా అభిమానులతో సరదాగా ముచ్చటించిన రవికి అభిమానుల నుంచి ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఈ ప్రశ్నలకు రవి సమాధానం తెలియజేస్తున్నారు.ఈ క్రమంలో కుటుంబంతో కలిసి అమెరికా ట్రిప్ కు ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించడమే కాకుండా మీ నెల సంపాదన ఎంత అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రవి సమాధానం చెబుతూ అమెరికా ట్రిప్ కి అయిన ఖర్చు డాలర్స్ లో చెప్పాలా? రుపీస్ లో చెప్పాలా అంటూ సమాధానం తెలియజేశారు.అదే విధంగా ఈ నెల సంపాదన గురించి మాట్లాడుతూ ఏదో యావరేజ్ సంపాదన భయ్యా అంటూ సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఇలా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు రవి చెప్పిన సమాధానాలు వైరల్ అవుతున్నాయి.