రిటైర్డ్ ఉద్యోగస్తులకు శుభవార్త… ఈ ఎల్ఐసి పాలసీతో ప్రతి నెల ఆదాయం..?

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ (ఎల్ఐసి ) అందిస్తున్న జీవిత బీమా పథకాల ద్వారా ప్రజల ఆర్థికంగా ఎంతో సహాయం పొందుతున్నారు. ఎల్ఐసి అందిస్తున్న పథకాల ద్వారా ప్రజలు తమ డబ్బుని ఇన్వెస్ట్ చేసి కొంతకాలం తర్వాత అధిక మొత్తంలో ఆదాయం పొందుతున్నారు. ఎల్ఐసి పాలసీదారుల సంఖ్య రోజుకి పెరిగిపోవటంతో తమ పాలసీదారుల అవసరాల మేరకు ఎల్ఐసి కొత్త కొత్త తీసుకొస్తుంది. ఇప్పటికే ఎల్ఐసి అందిస్తున్న ఎన్నో పథకాల ద్వారా పాలసీదారులు లబ్ధి పొందుతున్నారు. ఎల్ఐసి లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి.

ఇక ఇటీవల రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల కోసం ఎల్ఐసి మరొక సరికొత్త పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఉద్యోగం చేస్తున్నంతకాలం నెల నెల వచ్చే ఆదాయంతో జీవన ప్రయాణానికి భరోసా ఉంటుంది. అయితే ఉద్యోగ విరమణ తర్వాత పరిస్థితి తారుమారు అవుతుంది. నెల నెల ఆదాయం లేక ఇంటి ఖర్చులు పెరిగిపోవడమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా తెలుపుతాయి దీంతో ఉద్యోగ విరమణ తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. అలాంటి వారి కోసం ఎల్ఐసీ జీవన్ అక్షయ్ పాలసీ ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని కొనడం వల్ల, మీరు ప్రతి నెలా దాదాపు 36 వేల రూపాయలు పొందవచ్చు. దీంతో రిటైర్మెంట్ తర్వాత ఎవరి పైనా ఆధారపడకుండా గౌరవంగా బతకవచ్చు.

ఈ పాలసీలో ప్రతి నెలా రూ. 36,000 పొందడానికి యూనిఫాం రేటుతో జీవితాంతం చెల్లింపు యాన్యుటీ ఆప్షన్ తీసుకోవాలి. అంటే 45 సంవత్సరా వయసు ఉండి ఈ ప్లాన్ని తీసుకోవాలి అనుకుంటే.. రూ. 70 లక్షల సమ్ అస్యూర్డ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇందులో 71,26,000 రూపాయల సింగిల్ పేమెంట్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. జీవన్ అక్షయ్ పాలసీ లో డబ్బు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రతి నెలా రూ. 36,429 పెన్షన్ వస్తుంది. అయితే అనుకోని కారణాల వల్ల పాలసీదారు చనిపోతే, పింఛను ఆగిపోతుంది. అంతే కాకుండా 35 నుంచి 85 ఏళ్ల వయస్సు వారు కూడా ఈ ప్లాన్ తీసుకోవచ్చు.ఈస్కీం ద్వారా నెల, మూడు నెలలు ఆరునెలలు లేదా ఏడాదికి ఒకసారి పింఛను మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇక 75 ఏళ్లు వయసులో ఈ పాలసీ తీసుకోవాలని అనుకుంటే రూ. 6,10,800 ఏకమొత్తం ప్రీమియం చెల్లించాలి. దీనిపై సమ్ అస్యూర్డ్ ఆప్షన్ రూ. 6 లక్షలు. ఇక నెలకు 6 వేల రూపాయల పింఛన్ అందుతుంది.