ఇంట్లో పాడైపోయిన దేవుళ్ల పటాలు ఉంటే వాటిని ఏం చేయాలో మీకు తెలుసా?

హిందువులలో చాలామంది దేవుళ్లను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే కొన్ని సందర్భాలలో దేవుళ్ల చిత్రపటాలకు సంబంధించిన అద్దాలు పగిలిపోవడం, విగ్రహాలు విరిగిపోవడం జరుగుతుంది. వాటిని ఏం చేయాలో అర్థం కాక కొంతమంది దేవాలయాల దగ్గర వాటిని విడిచిపెడుతూ ఉంటారు. మరి కొందరు చెట్ల దగ్గర, నిర్మానుష్య ప్రదేశాలలో దేవుళ్ల చిత్రపటాలను వదిలేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల మంచి కంటే చెడు జరిగే అవకాశాలు ఉంటాయి.

అయితే దేవుని చిత్ర పటాలను ఎక్కడ పడితే అక్కడ వదిలేయకుండా అగ్నికి ఆహుతి ఇస్తే మంచిది. అగ్నిలో దేవుని చిత్ర పటాలను ఈ విధంగా వేసినా శుభ ఫలితాలు కలుగుతాయి. అగ్నిలో దేవుని పటాలను వెయ్యడం ఏ మాత్రం తప్పు కాదని పండితులు సైతం చెబుతున్నారు. ఒకవేళ దేవుని విగ్రహాలు విరిగిపోయి ఉంటే వాటిని నదిలో వేయడం మంచిది. విగ్రహానికి నమస్కరించి వాటిని నదిలో వెయ్యడం మంచిది.

ఇంట్లో విరిగిపోయిన దేవుని చిత్ర పటాలను, విగ్రహాలను అలానే ఉంచి వాటిని పూజించడం మాత్రం మంచిది కాదని పండితులు వెల్లడిస్తున్నారు. గచ్చ గచ్చ సుర శ్రేష్ట స్వస్థాన పరమేశ్వర అని మనస్సులో అనుకుంటూ విరిగిపోయిన విగ్రహాలను నదిలో, చెరువులో పడేయడం మంచిది. ఇందుకు సంబంధించి సందేహాలు ఉంటే పండితుల సలహాలు తీసుకోవాలి. స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఇందుకు సంబంధించిన సమాచారం ఇస్తే మంచిది.

ఎక్కడ పడితే అక్కడ దేవుని చిత్రపటాలను వదిలేస్తే మాత్రం పాపం తగులుతుంది. దేవుళ్లను పూజించేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిది. ఇంట్లో ఒకే దేవునికి సంబంధించిన చిత్రపటాలు కాకుండా వేర్వేరు దేవుళ్లకు సంబంధించిన పటాలు ఉంటే మంచిదని చెప్పవచ్చు.