Lokesh : ఎలా లోకేష్ బాబూ.. ఏం చేసి గెలుస్తావ్.?

Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్, వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీ చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ఇంతలా ఆయన ప్రకటన చేయడానికి కారణం, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన స్థానం నుంచి మళ్ళీ పోటీ చేసే ఉద్దేశ్యం లోకేష్‌కి లేదనీ, గన్నవరం వైపుగా లోకేష్ ఆలోచనలు సాగుతున్నాయంటూ ప్రచారం జరుగుతుండడమే.

కాగా, చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ పరిస్థితులు తారుమారైపోయాయి. ఈ నేపథ్యంలో అటు చంద్రబాబు, ఇటు నారా లోకేష్.. తమ తమ నియోజకవర్గాల్ని మార్చుకుంటారంటూ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు ఎటూ కుప్పం వదిలే అవకాశం లేదు. మంగళగిరిలోనూ నారా లోకేష్ తిష్ట వేసేసినట్లే. అయితే, గెలుస్తారా.? లేదా.? అన్నదానిపైనే సస్పెన్స్. ఇప్పుడున్న ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే, నారా లోకేష్ ఈసారి మంగళగిరిలో డిపాజిట్ తెచ్చుకుంటారా.? లేదా.? అన్న అనుమానాల్ని అధికార వైసీపీ వ్యక్తం చేస్తోంది.

కాగా, టీడీపీ అధినేత చంద్రబాబుని ఓడించేందుకు వైసీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. చంద్రబాబు గెలిచేస్తారేమో.. అక్కడ ఆయనకు సింపతీ వర్కవుట్ అవచ్చు. లోకేష్ పరిస్థితే దయనీయంగా మారింది. నియోజకవర్గం మార్చడానికి వీల్లేకుండా పోయింది. మార్చితే, అవమాన భారం.

అందుకే, మంగళగిరి మీదనే తెగ ఫోకస్ పెట్టేశారు చినబాబు. మూడు రాజధానుల వ్యవహారాన్ని కాస్త పక్కన పెట్టారు గనుక, అమరావతి మీద స్పెషల్ ఫోకస్ ఏమైనా వైసీపీ పెడితే, లోకేష్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది మంగళగిరిలో.