Hair Care: జుట్టు స‌మ‌స్య‌లకు సింపుల్ పరిష్కార మార్గాలు !

Homeremedies for hair problems

Hair Care: హెయిర్ కు సంబంధించిన సమస్యల వల్ల నేటి జనరేషన్ డిప్రెషన్ కు గురవుతుంది. మరి ఈ జుట్టు సమస్యల నుంచి బయట పడటానికి ఉన్న బెస్ట్ మార్గాలు ఏమిటో చూద్దాం. అయితే ఆ మార్గాలు తెలుసుకునే ముందు జుట్టు వేటి కారణంగా ఊడిపోతుందో తెలుసుకుందాం.

జుట్టు రాల‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు ఇవే?

మొదటిగా జన్యు పరమైన కారణం వలన జుట్టు ఊడిపోతుంది. హెయిర్ ని శుభ్రపరచడంలో చేసే తప్పిదాల వలన కూడా జుట్టు రాలే సమస్య ఎదురవుతుంది. ఇంకా అల్క‌హాల్, కెరాటిన్ అనే ప్రోటీన్ ను ప్ర‌భావితం చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం ప్రారంభ‌మ‌వుతుంది. చక్కెర ఎక్కువగా తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్య వస్తుంది. దీంతో జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. డైట్ సోడాలో అస్పర్టమే అనే కృత్రిమ చక్కెరను క‌ల‌ప‌డం వ‌ల్ల ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది. వత్తిడి, ఆందోళన ఎక్కువైతే కూడా జుట్టు రాలిపోతుంది.

ఇక జుట్టు సమస్యల నుంచి బయట పడటానికి ఉన్న బెస్ట్ మార్గాలు ఇవే:

మొదటిగా మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే జుట్టు సమస్యలను తగ్గించేసుకోవచ్చు. ప్రతిరోజూ ఒక కప్పు వేరుశనగలను రాత్రి అంతా నీటిలో నానబెట్టి ఉదయం తినండి. జుట్టు రాలటం తగ్గిపోయి వత్తుగా పెరుగుతుంది. ప్రతి రోజు మధ్యాహ్నం సమయంలో ఆకు కూరలను ఎక్కువగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కుదిరితే ప్రతి రోజు లేదంటే రెండు రోజులకొకసారైనా తల స్నానం చేస్తే మాడు శుభ్రంగా ఉండడంతో జుట్టు సమస్యలను అరికట్టవచ్చు.

మందార పూలతో ఆవు మూత్రాన్ని కలిపి వాడటం వల్ల జుట్టు రాలటం తగ్గుతుంది. పాలలో గసగసాలు కలిపి ఒక హెయిర్ ప్యాక్ తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి కొంత సమయం ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చుండ్రు తొలగిపోతుంది. మెంతులను నానబెట్టి పెరుగుతో కలిపి మెత్తగా పేస్ట్ లా చేసి తలకు రాసుకుని ఒక గంట ఉంచుకుని గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చుండ్రు సమస్యనే కాకుండా మరికొన్ని సమస్యలు కూడా తగ్గిపోతాయి. వీటిని ఫాలో అయితే కచ్చితంగా మీకు ఉన్న జుట్టు సమస్యలు తీరిపోతాయి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ హెల్దీ హెయిర్.