Crime News: పూర్వంతో పోల్చుకుంటే ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దానికి సమానంగానే అన్ని దుష్పరిణామాలు కూడా ఉన్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల కొత్త కొత్త పద్దతులలో నేరాలకు పాల్పడుతున్నారు. కానీ ఈ టెక్నాలజీ వల్ల ఇటీవల జగిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకుందాం.
వివరాలలోకి వెళితే…హైదరాబాద్ కేపీహెచ్‌బీ రెండో రోడ్డులోని ఎల్‌ఐజీ 237 ప్లాట్ యజమాని పని నిమిత్తం ఇంటికి తాళం వేసి అమెరికా వెళ్ళాడు. దొంగతనం చేయటానికి మంచి సమయం కోసం ఎదురు చూస్తున్న దొంగ ఇదే మంచి సమయం అనుకోని తాళాలు బద్దలు కొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న ఇంటి యజమాని ఇంట్లో బిగించిన సి సి కెమెరా ఆధారంగా భారత కాలయనం ప్రకారం బుదవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సీసీ కెమెర ఫుటేజ్ చెక్ చేయగా ఇంట్లోకి దొంగ ప్రవేశించినట్లు గుర్తించాడు.
వెంటనే అప్రమత్తమైన ఇంటి యజమాని చుట్టుపక్కల వారికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. వారు వెంటనే ఇంటి వద్దకు వెళ్లి చూడగా తాళం బద్దలుకొట్టి లోపల గడియ పేట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇంటిని చుట్టుముట్టి తలుపు తీయమని దొంగను హెచ్చరించారు. దొంగ ఎంతసేపటికీ తలుపు తీయకపోతే తలుపు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి దొంగను అదుపులోకి తీసుకున్నారు. దొంగలించిన నగలు, డబ్బు మొత్తం స్వాధీనం చేసుకొని దొంగను పోలీస్ స్టేషన్ కి తరలించారు.