హాలీవుడ్ సినిమాలను పక్కకునెట్టి.. మొదటి స్థానంలో నిలిచిన ఆర్ఆర్ఆర్!

RRR

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా మార్చి 25 వ తేదీ థియేటర్లో విడుదల అయి బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వంద కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీలో ప్రసారమవుతోంది.ఈ సినిమా డిజిటల్ హక్కులను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకోగా, హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

ఈ క్రమంలోనే థియేటర్ లో అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా మే నెల 20వ తేదీ నుంచి డిజిటల్ మీడియాలో ప్రసారం అవుతూ మరోసారి ప్రేక్షకులను సందడి చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాలలో టాప్ టెన్ సినిమాలలో ఒకటిగా ఈ సినిమా నిలబడింది. అదేవిధంగా నెట్ఫ్లిక్స్ ఇంగ్లీష్ లో హాలీవుడ్ సినిమాలను సైతం పక్కకునెట్టి అత్యధిక గంటలపాటు వీక్షించిన సినిమాగా ఈ సినిమా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.

ఈ విధంగా హాలీవుడ్ సినిమాలలో నెంబర్ వన్ స్థానంలో తెలుగు సినిమా ఉండటం ఎంతో గర్వకారణమని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా ద్వారా వీరికి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రావడమే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ క్రమంలోనే వీరి తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్నాయి.