వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్.! నివేదికలు ఏం చెబుతున్నాయ్.?

ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఓడిపోతారు.? ఏ ఎంపీ భవిష్యత్తు ఏంటి.? ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోల్డంత చర్చ జరుగుతోంది. మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయ్. ఆయా పార్టీల్లో అంతర్గతంగా జరిగిన సర్వేలకు సంబంధించిన లీకులు బయటకు వస్తుండడంతో, వాటిపై రాజకీయ నాయకుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

ప్రధానంగా అధికార వైసీపీ నేతల్లో టెన్షన్ నానాటికీ పెరిగిపోతోంది. ‘తలలు పగిలిపోతున్నాయ్..’ అంటూ కొందరు నేతలు, అందునా ప్రజా ప్రతినిథులు ఆఫ్ ది రికార్డుగా తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ‘ఇదెక్కడి టెన్షన్.?’ అంటూ తలలు పట్టుక్కూర్చుంటున్నారు. నిజానికి, గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓ వైసీపీ నేత (ప్రజా ప్రతినిథి, పైగా కీలక పదవిలో గతంలో వుండేవారు) తనకు తాను చేయించుకున్న సర్వేలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్.. అని తేలిందట. ఇంకో పార్టీ (ప్రత్యర్థి పార్టీల్లో ఒకటి) చేయించిన సర్వేలో, ఘోర పరాజయం.. అని రిజల్ట్ వచ్చిందట.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు ప్రజా ప్రతినిథులు కలిసి చేయించుకున్న సొంత సర్వేలోనూ నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందట. ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతలు కొందరు విషయం బయటకు పొక్కకుండా, ఓ మూడో వ్యక్తి ద్వారా సర్వే చేయించుకున్నారట. అందులో ముగ్గురికీ గండం పొంచి వుందని తేలిందట.

ఇలా, ఏపీ రాజకీయాలకు సంబంధించి చిత్ర విచిత్రమైన విషయాలు బయటకు వస్తున్నాయి. 2024లో షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అసెంబ్లీ అలాగే లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఈలోగా సర్వేలు మామూలే కదా.!

మొత్తంగా 175 సీట్లూ గెలిచేస్తామని పైకి చెబుతూనే, ‘కొంతమంది సరిగ్గా పని చేయడంలేదని తేలింది.. ఓడిపోయే అవకాశం వున్నవాళ్ళకు సీట్లు ఇచ్చది లేదు..’ అని ముఖ్యమంత్రి చెప్పడం చాలామంది వైసీపీ ప్రజా ప్రతినిథులు జీర్ణించుకోలేకపోతున్నారు.