మాజీ సీఎస్ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి జగన్ సర్కార్ కి మొట్టికాయలు తప్పలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టులో మూడుసార్లు విచారణ జరిగినా సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని రమేష్ కుమార్ తరుపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయినా రాష్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పుని ఇప్పటివరకూ అమలు చేయలేదని వివరించారు. ఈ సదర్భంగా రాష్ర్ట ప్రభుత్వం తీరుపై హైకోర్టు మండిపడింది. వెంటనే గవర్నర్ ని కలిసి వినతి పత్రం అందజేయాలని కోర్టు రమేష్ కుమార్ కు సూచించింది.
హైకోర్టు తీర్పును అమలు చేయాలని గవర్నర్ ని కలవాలని ఆదేశించింది. అయితే గవర్నర్ ని కలిసేందుకు ఇప్పటికే సమయం కోరామని రమేష్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు అదేశాల మేరకు రాష్ర్ట ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డను నియమించే అధికారం గవర్నర్ కు ఉందని స్పష్టంగా చెప్పింది. కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని రాష్ర ప్రభుత్వాన్ని హైకోర్టు అదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. దీంతో వచ్చే వారం ప్రభుత్వం వినిపించే వాదనలు ఎలా ఉంటాయి? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో హైకోర్టు తీర్పులను సవాల్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్లింది ప్రభుత్వం.
చివరికి అత్యున్నత న్యాయస్థానంలో కూడా మొట్టికాయలు తప్పలేదు. సుప్రీంకోర్టు తీర్పు కూడా నిమ్మగడ్డకే అనుకూలంగా వచ్చింది. దీంతో వివాదాన్ని ప్రభుత్వం మరింత సీరియస్ గా తీసుకుంది. రమేష్ కుమార్ అంతే ధీటుగా ప్రభుత్వంతో చట్టపరంగా పోరాటం చేస్తున్నారు. అయితే ఆ మధ్య బీజేపీ నేత సుజనా చౌదరి, సీఎం రమేష్ కుమార్ తో హోటల్ పార్క్ హయత్ లో నిమ్మగడ్డ రహస్య సమావేశంపై పలు అనుమానాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పదవిలో ఉన్న నిమ్మగడ్డకు రాజకీయ నాయకులతో పనేంటి? ఈ కేసులో రాజకీయ కుట్ర ఉందన్న అనుమానం కూడా వ్యక్తం అయింది.