సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటుల జీవితాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికి తెలియదు. రాత్రికి రాత్రే స్టార్ సెలబ్రెటీలుగా మారిన వారు ఎందరో ఉండగా, ఇండస్ట్రీలో హీరోలతో పాటుగా రెమ్యూనరేషన్ తీసుకొని చివరికి అయిన వాళ్ల చేతిలో మోసపోయి రోడ్డున పడ్డ సెలబ్రిటీలు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇలా ఒకప్పుడు వెండితెరను ఏలిన నటీమణులు చివరికి రోడ్డున పడ్డారు. మరి వారు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం…
సావిత్రి: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో అద్భుతమైన నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సావిత్రి గురించి అందరికీ సుపరిచితమే. ఎడ్లబండి ఎక్కడానికి కూడా అర్హత లేనటువంటి సావిత్రి ఇండస్ట్రీలో తిరుగులేని నటిగా కొనసాగారు.ఇలా ఇండస్ట్రీలో భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతూ అడిగినవారికి దానధర్మాలు చేస్తూ చివరికి నమ్మిన వారిని నట్టేట ముంచేయడంతో ఈమె తాగుడుకు బానిస అయ్యి ఉన్న ఆస్తులను పోగొట్టుకుని చివరికి ఎంతో దీన పరిస్థితుల్లో మృతి చెందారు.