సినిమా చూస్తూ నిద్రపోయిన హీరోయిన్! కంటతడి పెట్టుకున్న హీరో?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బంగార్రాజు, లవ్ స్టోరీ వంటి హిట్స్ అందుకున్న నాగచైతన్య ఇటీవల థాంక్యూ సినిమాతో వచ్చాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మిశ్రమ ఫలితాలను దక్కించుకుంది. ఇదిలా ఉండగా నాగచైతన్య ప్రస్తుతం లాల్ సింగ్ చెద్దా అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాకి అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించారు. హాలీవుడ్‌ సినిమా ‘ఫారెస్ట్‌ గంప్‌’ కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో అమీర్ ఖాన్ కి జోడిగా కరీనాకపూర్ నటించింది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కీలకపాత్రలో నటించాడు.

ఆన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో విడుదల కానుంది. షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ పోస్టర్, టీజర్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానుండటంతో ఇటీవలే హైదరాబాద్‌లో చిరంజీవి ఇంట్లో ప్రీమియర్ షో వేశారు. ఈ షో చూడటానికి అమీర్ ఖాన్, చిరంజీవి, రామ్ చరణ్ అక్కినేని నాగార్జున, నాగచైతన్యతో పాటు దర్శకులు రాజమౌళి సుకుమార్ కూడా హాజరయ్యారు. ఈ సినిమాలో నాగచైతన్య నటనను మెగాస్టార్ కొనియాడారు.

ఇదిలా ఉండగా ఇటీవల లాల్ సింగ్ చడ్డా ప్రీమియర్ షో ని అమీర్ ఖాన్ తన మాజీ భార్య కిరణ్ రావుతో పాటు కరీనా కపూర్‌ తో కలిసి చూసాడు. అయితే ఈ ఘటనకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రీమియర్ షో ని అమీర్ ఖాన్, కిరణ్ రావు ఎంతో ఆసక్తిగా చూస్తుంటే కరీనా కపూర్‌ మాత్రం నిద్రపోతోంది. అంతేకాకుండా సినిమా చూస్తూ అమీర్ ఖాన్ ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టుకున్నారు. అయితే వారిద్దరూ ఎంతో ఏకాగ్రతతో సినిమా చూస్తుంటే కరీనా కపూర్ మాత్రం సినిమా చూడకుండా నిద్రపోతోంది. ఈ ఫోటోలు లీక్ అవ్వటంతో సినిమా అంత బోరింగ్ గా ఉందా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. అమీర్ ఖాన్ ‘ఫారెస్ట్‌ గంప్‌’ సినిమాని ముందే చూసినట్టు లేడు. అందుకే ఎమోషనల్ అయ్యాడు అంటూ కొందరూ కామెంట్స్ చేస్తున్నారు.