Allu Arjun: బన్నీతో ..అమీర్ ఖాన్ సినిమా ఫుల్ క్లారిటీ ఇచ్చిన హీరో?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల ఈయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందిన తర్వాత అల్లు అర్జున్ బాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అవుతారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు అమీర్ ఖాన్ సైతం అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇలా అల్లు అర్జున్ తో అమీర్ ఖాన్ చేయబోతున్నారని వార్తలు రావడంతో తాజాగా అమీర్ ఖాన్ స్పందించారు. అమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్‌ పర్‌ సినిమా విడుదల అయింది. ఆ సినిమా ప్రమోషన్‌ సమయంలో మాట్లాడుతూ… టాలీవుడ్‌కి చెందిన అల్లు అరవింద్‌ ఫ్యామిలీతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గజిని సినిమా వారితో కలిసి చేయడం వల్ల సాన్నిహిత్యం ఉందని తెలిపారు.. అయితే తాను అల్లు అర్జున్ తో కలిసి సినిమా చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.

నాకు అల్లు కుటుంబంతో చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. బన్నీతో కూడా చాలా మంచి పరిచయం ఉందని తెలిపారు. అయితే ప్రస్తుతానికి తనతో కలిసి సినిమా చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదని భవిష్యత్తులో అలాంటి ఆలోచన వస్తే సినిమా చేస్తానేమో కానీ ప్రస్తుతానికైతే ఆలోచన లేదని తెలిపారు. అయితే ఇటీవల కాలంలో అమీర్ ఖాన్ తో కలిసి అల్లు అర్జున్ దిగిన ఫోటో ఒకటి వైరల్ గా మారడంతో ఈ వార్తలకు బీజం పడింది. కానీ అమీర్ ఖాన్ ఈ వార్తలకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు.