Manjima Mohan: మంజిమా మోహన్ ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీకి అంతగా పరిచయం ఉండదు. కానీ ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా హీరోయిన్ అంటే ఎవరైనా ఇట్టే గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది ఈ భామ. ఇక తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక టాలీవుడ్ ప్రేక్షకులకులతో అంత ర్యాపో లేని ఈ భామ. తమిళ్ ప్రేక్షకులకి వేరే స్థాయి లో దగ్గరయింది. ఇదిలా ఉంటే మంజిమా మోహన్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందన్న విషయం తెలుస్తుంది. ఇక వరుడు విషయానికి వస్తే ఎవరో కాదు. తమిళ నటుడు గౌతమ్ కార్తీక్ వీరిద్దరూ కలిసి దేవత సినిమాలో నటించిన సంగతి మనకు తెలుసు. ఇక ఈ సినిమాలో నటించిన ర్యాపో కాస్త ప్రేమ వరకు తీసుకు వెళ్ళింది.
ఇక వీరి రిలేషన్ ను ఇప్పటి వరకు బయట పెట్టలేదు. కాస్త రహస్యంగానే ఉంచారు. మొత్తానికి వీరిద్దరి పెళ్ళికి శుభం కార్డు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అదే కాకుండా వీరి ప్రేమ వివాహానికి వారి పెద్దలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ జంట తమ వివాహం గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.
ఇక మంజిమా మోహన్ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన పోస్టులను నెటిజన్లకు పంచుకుంటూ తెగ ఆకట్టుకుంటుంది. ఇక మంజిమా మోహన్ తమ ప్రేమ పెళ్లి గురించి ఏ విధంగా స్పందిస్తారో ఎదురు చూడాల్సి ఉంది.