80 లక్షలు డిమాండ్ చేస్తోందట ఆ హీరోయిన్

Heroine asking 80 lakhs remuneration

Heroine asking 80 lakhs remuneration

హీరోయిన్లు రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గట్లేదు. అడిగినంతా ఇవ్వాల్సిందే అంటున్నారు. ఒక్క హిట్ పడితే చాలు కోటి రూపాయలు అడిగేస్తున్నారు. ఇక బ్యాక్ టూ బ్యాక్ హిట్లు పడితే చెప్పనక్కర్లేదు. ఆ మొత్తం కోటి దాటి కోటిన్నరకు చేరువైనా ఆశ్చర్యం అక్కర్లేదు. నయనతార ఇప్పటికే 2 కోట్ల వరకు తీసుకుంటుండగా ఇటీవల సమంత సైతం ‘శాకుంతలం’ కోసం కోటిన్నర పుచ్చుకున్నట్టు వార్తలొచ్చాయి. ఇక రష్మిక కూడ కోటి దాటేసింది టాక్. కొత్త హీరోయిన్ కృతి శెట్టి సైతం కోటి నెంబర్ దగ్గర ఆగిందని ఆంటున్నారు.

వీళ్లంతా హిట్ సినిమా ఖాతాలో ఉండటం వలన, క్రౌడ్ పుల్లర్స్ కావడం మూలాన అంత డిమాండ్ చేస్టయున్నారు అంటే అర్థం ఉంది. కానీ ఒక హీరోయిన్ మాత్రం హిట్ లేకపోయినా 80 లక్షలు అడుగుతోందట. గత రెండు మూడేళ్ళ కాలంలో ఆమె తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమానే. అది కూడ డిజాస్టర్. తమిళంలో కొన్ని చేసినా అవి కూడ ఒక మోస్తరు సినిమాలే తప్ప సాలిడ్ హిట్లు కాదు. పైపెచ్చు ఆమె ఎక్కువగా చేసేది సెకండ్ హీరోయిన్ పాత్రలే. బన్నీ, రానా, గోపీచంద్, విజయ్ దేవరకొండ సినిమాల్లో ఆమె రెండవ హీరోయిన్ పాత్రలే చేసింది. మంచి గ్లామర్ ఉన్నా సరే ఆమెకు మెయిన్ లీడ్ రోల్స్ రావట్లేదు. అయినా కూడ ఆమె తగట్లేదు. సినిమాకు 80 లక్షలు చెల్లించాల్సిందే అంటోందట.