మాధవన్ ను అలా చూసి షాక్ అయిన సూర్య.. ఏకంగా దండం పెట్టేసారు?

హీరో మాధవన్ ఎన్నో తమిళ సినిమాల్లో నటుడిగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఆయన కేవలం సినిమాలు మాత్రమే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో వెండితెరకు పూర్తిగా దూరమైన మాధవన్ తాజాగా ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రంరాకెట్రీ. ఇందులో మాధవన్ నంబి నారాయణన్ పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు మాధవన్ దర్శకత్వం వహించడం గమనార్హం.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సన్నివేశాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
రాకెట్రీ చిత్రీకరణ చూసేందుకు నంబి నారాయణన్‏తో కలిసి షూటింగ్ లోకేషన్ లోకి అడుగుపెట్టారు హీరో సూర్య. ఇలా ఈయన షూటింగ్ లొకేషన్ లోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా నంబి నారాయణన్ వేషధారణలో ఉన్నటువంటి మాధవన్ ని చూసి నోరెళ్లబెట్టారు.

ఈ విధంగా షూటింగ్ లొకేషన్ లోకి హీరో సూర్య ఎంట్రీ ఇవ్వగానే మాధవన్ ఆ గెటప్లో చూసేసరికి ఎంతో ఆశ్చర్యానికిలోనై ఒక్కసారిగా మాధవన్ కి దండం పెట్టేసారు. ఇక సూర్యతో పాటు శాస్త్రవేత్త నంబి నారాయణన్ రాగానే కుర్చీలో నుంచి వెంటనే లేచి మాధవన్ వారికి స్వాగతం పలికారు. ఇలా ఇరువురికి స్వాగతం పలికిన మాధవన్ సూర్యను నారాయణన్ కి పరిచయం చేశారు. ఈ సందర్భంగా సైంటిస్ట్ నారాయణన్ మాట్లాడుతూ తనకు సూర్య సినిమాలంటే ఎంతో ఇష్టమని అలాగే తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అంటే కూడా చాలా ఇష్టం అని ఈ సందర్భంగా తెలియజేశారు.ఇకపోతే ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.