అభిమాని చనిపోవడంతో ఎవరూ ఊహించని పని చేసిన హీరో సూర్య.. ఏం చేశారంటే?

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఎంతోమంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సూర్య కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. ఈ క్రమంలోనే ఈయన సినిమాలకు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సినిమాల పరంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సూర్య సామాజిక కార్యక్రమాలను చేయడంలో కూడా ముందు వరుసలో ఉంటారు. ఈ క్రమంలోనే తన ఆగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులను ఆదుకుని వారికి బంగారు భవిష్యత్తును కల్పించారు.

ఇకపోతే సూర్య అభిమానుల కోసం ఎంతో ఆరాట పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తరుచూ అభిమానుల వివాహాలకు హాజరు కావడం లేదా అభిమానులకు ఏదైనా సమస్య తలెత్తితే వారికి అండగా నిలబడడం చేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా సూర్య అభిమాని జగదీశన్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ క్రమంలోని ఇతని మరణవార్త తెలుసుకున్న సూర్య చలించిపోయారు. తన అభిమాని మరణవార్త వినగానే సూర్య తన ఇంటికి చేరుకొని తనకు నివాళులు అర్పించారు.

ఈ విధంగా అభిమాని మృతి చెందిన వార్త తెలుసుకుని స్వయంగా సూర్య వెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు ఇతనిని చూడగానే బోరున విలపించారు. సూర్య కుటుంబ సభ్యులను ఓదారుస్తూ తాను చనిపోయిన తమ కొడుకుని తీసుకురా లేను కానీ, తన పిల్లలకు ఏ అవసరం వచ్చినా ముందుండి తన బాధ్యతలను నెరవేరుస్తానని, ఈ సందర్భంగా అభిమాని కుటుంబానికి సూర్య భరోసా కల్పించారు. ఈ క్రమంలోనే తన అభిమాని పిల్లలకు చదువు, వైద్యానికి అయ్యే ఖర్చులన్నీ కూడా తన ఫౌండేషన్ ద్వారా అందించాలని సూర్య ప్రకటించారు.ఈ విధంగా అభిమాని మృతి పట్ల సూర్య స్పందించి ఆయన కుటుంబానికి అండగా నిలవడంతో సూర్య నిజంగానే హీరో అంటూ అభిమానులు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.