The Warrior First Look : పోలీస్ గన్ తో రామ్ ఫస్ట్ లుక్!

The Warrior First Look :  ఈ రోజు ‘ఇస్మార్ట్ శంకర్’ ఫేమ్ ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని ఫ్యాన్స్ కి పండగ! లేటెస్ట్ మూవీలో తమ అభిమాన స్టార్ ఏ లుక్ తో కనిపిస్తాడనే అంచనాలకి తగ్గట్టు జబర్దస్త్ గా ఎంట్రీ ఇచ్చాడు- హై వోల్టేజ్ యాక్షన్ మూవీ పోస్టర్ తో! మందపాటి మీసాలతో, క్లీన్ షేవ్ గడ్డంతో డైనమిక్ పోలీసుగా లుక్కిచ్చాడు. తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో మరో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయ్యాడు రామ్. సోమవారం మధ్యాహ్నం ఈ మూవీ టైటిల్ పోస్టర్‌తో పాటు, ఫస్ట్ లుక్ పోస్టర్‌ ని మేకర్స్ రివీల్ చేశారు. ‘ది వారియర్’ అనే టైటిల్‌తో, ఫస్ట్ లుక్‌లో రామ్ పోతినేని ఫ్యాన్స్ ని ఫుల్ ఖుష్ చేసే వైబ్రెంట్ పొజిచ్చాడు గన్ పట్టుకుని!

ఈ మూవీటో మొదటిసారిగా రామ్ పోతినేని పోలీసు పాత్రలో థ్రిల్ చేయబోతున్నాడు. పోలీస్ టీమ్ తో రామ్ ఒక ముఖ్యమైన మిషన్‌లో పోలీసు అధికారిగా కనిపిస్తాడు. RAPO 19 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీలో రామ్ కి జంటగా కృతీ శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. లింగు స్వామి దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో రూపొందుయ్తున్న ఈ చిత్రంలో ఇంకో హీరోయిన్ గా అక్షర గౌడ నటిస్తోంది. ఆది పినిశెట్టి శెట్టి విలన్‌గా నటిస్తున్నాడు.
ఈ మూవీ 65 శాతం చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్‌, చెన్నైలలో షూటింగు జరుపుకుంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెరకెక్కించిన సుజిత్ వాసుదేవ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కాగా, దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరకర్త.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.