ఆ ప్లాప్ బాలీవుడ్ హీరోతో రామ్ రిస్క్ చేస్తున్నాడా?

పూరి జగన్నాధ్ ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ తరువాత రామ్ నటించిన ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు. పెద్ద అంచనాల మధ్య వచ్చిన ‘ది వారియర్’ భారీ డిసాస్టర్ గా నిలిచింది. త్వరలో బోయపాటి తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు రామ్. ఈ సినిమాలో రామ్ ఫాదర్ క్యారెక్టర్ చాలా కీలకం అట. ఈ రోల్ కోసం బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి ని తీసుకునే ఆలోచనలో ఉన్నారు.
అయితే సునీల్ శెట్టి సౌత్ చేసిన ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు, పైగా భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. కానీ సునీల్ శెట్టి ని ఎంపిక చేసారా లేదా అనేది ఇంకా తెలియలేదు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. అన్నిటికీ మించి హీరో ఎవరైనా తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేసి హిట్ కొట్టడంలో బోయపాటికి మంచి అనుభవం ఉంది. ఈ సినిమాతో అయినా రామ్ హిట్ కొడతాడా లేదా చూడాలి.