పెళ్లిపీటలెక్కనున్న హీరో రామ్..? అమ్మాయి ఎవరో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవదాసు సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ మస్కా, రెడీ, పండగ చేస్కో, ఇస్మార్ట్ శంకర్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకాలం బ్యాచిలర్ గా ఉన్న రామ్ తొందర్లోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రామ్ తన చిన్ననాటి స్నేహితురాలితో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరూ ఇరు కుటుంబసభ్యుల పెద్దల అంగీకారంతో తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.

గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ తన పెళ్లి గురించి స్పందిస్తూ..పెళ్లి అనేది మన చేతుల్లో ఉండదు…అది జరగాల్సిన టైం లో జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ టైమ్ వచ్చింది అంటూ ఫ్యాన్స్‌ సంబర పడుతున్నారు. ప్రస్తుతం రామ్ నటించిన “ది వారియర్” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జూలై 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత రామ్ తను ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే వీరి పెళ్లి కూడా జరగనున్నట్లు సమాచారం.

హీరో రామ్ మొత్తానికి తన బ్యాచిలర్ లైఫ్ కి పులిస్టాప్ పెట్టి పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించనున్నాడు అంటూ ఆయన అభిమానులు సంబర పడుతుంటే.. కొందరు మాత్రం ఈ వార్తలు నిజం కాకపోవచ్చు అంటూ కొట్టిపారేస్తున్నారు. మొత్తానికి రామ్‌ పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయం గురించి ఒక క్లారిటీ రావాలంటే రామ్ స్పందించాల్సి ఉంటుంది.ఇక రామ్ సినిమాల విషయానికి వస్తే.. ది వారియర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వత బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రామ్ నటించనున్నారు.