Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. విలన్ పాత్రలో ప్రభాస్.. బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్!

Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోలలో మొదటి స్థానంలో ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. అర డజన్ కు పైగా చేతిలో పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు ఇంకా షూటింగ్ దశలో ఉన్నప్పటికీ కొత్త కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉన్నారు డార్లింగ్ ప్రభాస్.. ఇందులో ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్ మొదలవగా మరికొన్ని సినిమాల షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. అయినా కూడా డార్లింగ్ ప్రభాస్ కొత్త కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ఇకపోతే డార్లింగ్ ప్రభాస్ ఇటీవల కన్నప్ప సినిమాలో రుద్ర పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు డార్లింగ్ ప్రభాస్ కేవలం హీరోగా మాత్రమే నటించారు. కానీ ఇకమీదట ప్రభాస్ విలన్ గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేట్‌ ఆడియన్స్‌ను సంపాదించుకున్న ప్రభాస్ విలన్‌గా కూడా అదే రేంజ్‌లో మెప్పించాలనుకుంటున్నాడట.

ఇప్పటికే సలార్ మూవీలో చూపించిన గ్రే షేడ్ క్యారెక్టర్‌ తో రచ్చ చేసిన ప్రభాస్, ఇప్పుడు మరో స్టెప్ ముందుకేసి ఫుల్ ఫ్లెడ్జ్ యాంటీ హీరోగా రెచ్చిపోవడానికి సిద్ధమవుతున్నాడట. ఇదే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. బాలీవుడ్ కి చెందిన డైరెక్టర్ తో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. కానీ ఆ డైరెక్టర్ ఎవరు అన్నది మాత్రమే ఇంకా తెలియడం లేదు. ప్రభాస్ కి కథ బాగా నచ్చిందని, అందుకే ఒక్క మీటింగ్ లోనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఎప్పుడు నటించని పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్, యాక్షన్ సీక్వెన్సెస్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయట. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.