ఇక్కడైతే “వీరసింహా రెడ్డి” ని “వాల్తేరు వీరయ్య” తొక్కేస్తున్నడా..?

చాలా కాలం తర్వాత మళ్ళీ టాలీవుడ్ సినిమా దగ్గర ఓ ఎపిక్ బాక్సాఫీస్ క్లాష్ అయితే రాబోతుంది. సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి అలాగే నందమూరి బాలకృష్ణ లు నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలు అందులోని మాస్ సినిమాలు కావడంతో అయితే ఫ్యాన్స్ లో అనేక అంచనాలు సెట్టయ్యాయి.

అయితే ఈ అంచనాలు పెరుగుతూ పెరుగుతూ ఫ్యాన్స్ లో ప్రిస్టేజియస్ గా మారగా ఆల్రెడీ బాలయ్య అభిమానులు అయితే తాను నటిస్తున్న “వీరసింహా రెడ్డి” సినిమాని ఓవర్సీస్ లో భారీ సంఖ్యలో థియేటర్స్ కి తీసుకోవాలని ప్లాన్ చేస్తూ మెగాస్టార్ వాల్తేరు వీరయ్యని ఓవర్సీస్ లో తొక్కే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆ మధ్య గాసిప్స్ వినిపించాయి.

కానీ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి వేరేగా ఉందట. ఇక్కడ వాల్తేరు వీరయ్యకి భారీ థియేటర్స్ అందులోని మంచి థియేటర్స్ దక్కుతుండగా వీరసింహా రెడ్డి కి కాస్త తక్కువే దొరుకుంటున్నట్టుగా సినీ వర్గాల్లో లేటెస్ట్ గా వచ్చిన ఇంట్రెస్టింగ్ న్యూస్.

మరి దీనితో అయితే ఇక్కడ మాత్రం వాల్తేరు వీరయ్య వీరసింహా రెడ్డి ని తొక్కేస్తున్నట్టే అని చెప్పాలి. ఇక బాలయ్య సినిమాకి అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా చిరు సినిమాకి బాబీ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు జనవరి సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్నాయి.