కాలంతో పాటు..రుతుపవనాల కాల గమనం కూడా మారిపోతుంది. సకాలంలో పడాల్సిన వర్షాలు పడటం లేదు. ఆషాఢ మాసం..శ్రావణ మాసంలో భారీగా వర్షాలు పడాలి. కానీ అన్నీ చోట్లా అలా జరగడం లేదు. రాష్ర్టంలో ఒక్కో చోట ఒక్కోలా ఉంది పరిస్థితి. అయితే అతివృష్టి..లేకపోతే అనావృష్టి. వైజాగ్ సిటీలో వర్షం పడితే….పంటలు పండే పొలొల్లే వర్షాలు పడటం లేదు. ఎప్పుడు వరదలు రాని వరంగల్ కి ఈ తడవ పెద్ద ఎత్తున వరద వచ్చింది. ఇక రాయలసీమలోని కొన్ని ప్రాంతాలైతే! అతివృష్టి..అనావృష్టికి పర్యాయ పదాలు లాంటివి. ఏపీలోనూ అమెరికా తరహాలో టోర్నడోలు వస్తున్నాయంటే? ఈ పరిస్థితిని ఏమనుకోవాలి. ఓ వైపు కరోనా ఉగ్రరూపం దాల్చుతోన్న సమయంలో టోర్నడోలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆ విషయాలు పక్కనబెట్టి వాతావరణ విషయాల్లోకి వెళ్తే…
ఏపీలో మరో రెండు రోజుల పాటు భారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సోమవారం ఉదయం తెలిపింది. ఉత్తర బంగాళా ఖాతంలోని ఈనెల 19వ తారీఖున మరో కొత్త అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆశాఖ వెల్లడించింది. దీంతో ఉత్తర కోస్తా..దక్షిణ కోస్తాంధ్ర సహా రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని ఆ శాఖ అంచనా వేస్తుంది. అల్ప పీడనం రూపం మార్చుకుంటే గనుక తేలిక పాటి వర్షాలు పడతాయని తెలిపింది. రైతులు వరి నాట్లు ఎలాంటి చింత లేకుండా వేసుకోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. మత్సకారులు కూడా చేపల వేటకు వెళ్లొచ్చని సూచించింది.
అయితే ఆయా పరిస్థితులను మత్సకారులు అంచనా వేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ పేర్కొంది. అలా కాకుండా అల్ప పీడనం గనుక ద్రోణిగా మారితే పరిస్థితులు ఎలా ఉంటాయో? చెప్పలేమని హెచ్చరించింది. సముద్ర తీరం వెంబడి ఉండే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని సూచించింది. ప్రస్తుతాని కైతే సముద్రం అల్లకల్లోలంగా ఉందని ఆ శాఖ ప్రకటించింది. అటు కృష్ణా, గోదావరి నదులు ఉగ్ర రూపంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాలన్నీ నీట మునిగాయి. ఈ నేపథ్యంలో రైతులు తమకు నష్టపరిహారం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.