గుండెనొప్పి వచ్చేముందు ఈ నొప్పులు వస్తాయా.. పాటించాల్సిన చిట్కాలు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. జీవనశైలి ఎంపికలు, అనారోగ్యకరమైన ఆహారం, అతిగా వ్యాయామం చేయడం వంటి అనేక కారణాల వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. గుండెపోటు ఎప్పుడు వస్తుందో కచ్చితంగా చెప్పలేమనే సంగతి తెలిసిందే. అయితే శరీరంలోని కొన్ని భాగాలు గుండెపోటు రాబోతుందని సూచిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎడమవైపు ఛాతిలో నొప్పి కలగడం అనేది రాబోయే గుండెపోటును సూచిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఛాతీ దగ్గర అసౌకర్యంగా ఉండటం కచ్చితంగా గుండెపోటు రావడానికి సంబంధించిన లక్షణాలలో ఒకటి. ఛాతీ మధ్యలో నుంచి ఎడమ వైపు నొప్పితో పాటు భారంగా ఉంటే వెంటనే వైద్యుని సలహాలు తీసుకుంటే మంచిది. మత్తుగా ఉండటం, వాంతులు కావడం ఇతర లక్షణాలు ఉన్నా వైద్యుని సలహాలు అవసరమని చెప్పవచ్చు.

కొన్ని సందర్భాల్లో తేలికపాటి లక్షణాలతో గుండెపోటు సంభవించే అవకాశాలు అయితే ఉంటాయి. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు బ్లాక్ అయినప్పుడు గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగ ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అజీర్ణం, బలహీనమైన కండరాలు లేదా అలసట వంటి బలమైన లక్షణాలు లేకుండా కూడా కొన్నిసార్లు హార్ట్ ఎటాక్ వస్తుంది. దీనిని సైలెంట్ హార్ట్ ఎటాక్ అని పిలుస్తారు.

గుండె కండరాలలో ఆక్సిజన్, పోషకాల కొరత వల్ల కూడా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆరు నెలలకు లేదా ఏడాదికి ఒకసారి శరీరానికి సంబంధించిన అన్ని పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.