కరోనా పేరుకు వైరసే కానీ.. దానంత తెలివి ఉన్న వైరస్ లు ఇంకేవి లేవు. నిజం.. అది ఆరోగ్యంగా ఉన్న వాళ్లను ఏం చేయదు.. చేయలేదు కూడా. కరోనా వైరస్ అటాక్ చేసేది బలహీనులనే. ఆరోగ్యంగా లేని వారి మీదనే దాని ప్రతాపం. ఆరోగ్యంగా ఉన్నవాళ్ల జోలికి పొమ్మన్నా పోదు అది. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవాళ్లు, హైబీపీ ఉన్నవాళ్లకే కరోనా రిస్క్ ఎక్కువట. అందుకే.. కనీసం ఈ కరోనా టైమ్ లో అయినా మీ గుండెను పదికాలాల పాటు పదిలంగా కాపాడుకోండి. దాని కోసం ఏం చేయాలో చదవండి..
గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువ టెన్షన్ పెట్టుకోకూడదు. ఒత్తిడి అస్సలే ఉండకూడదు. మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. మీరు మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటే మీ గుండె అంత ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి.
గుండె జబ్బులు ఉన్నవాళ్లు.. వచ్చే అవకాశాలు ఉన్నవాళ్లు ఖచ్చితంగా పొగాకు ఉత్పత్తులను వాడకూడదు. సిగిరెట్లు అస్సలు తాగకూడదు. ఒక ఏడాది సిగిరెట్ తాగకుండా ఉండండి.. సగానికి సగం గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.
వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాల్సిందే. అంటే రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం కోసం కేటాయించాలి.
అధిక బరువును కూడా తగ్గించుకోవాలి. దాని కోసం ఫ్యాట్ ఎక్కువగా ఉన్న పదార్థాల జోలికి పోకపోవడమే బెటర్. మీ ఫుడ్ లో ఎక్కువగా పీచు పదార్థం ఉండాలి. అది ఉంటేనే.. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలామటుకు తగ్గుతాయి. ఆహారంలో ఎంత ఉప్పు తగ్గిస్తే అంత మంచిది.