ఆరు నెలల్లో కరోనాకి వాక్సిన్ వస్తుందనే నమ్మకముంది: మంత్రి హర్షవర్దన్‌

vaccine came in next six months

కరోనా వ్యాక్సిన్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది తొలి మూడు నెలల లోగా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వ్యాక్సిన్ అభివృద్ధి కోసం వేగంగా పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. మూడు ర‌కాల వ్యాక్సిన్లకు మాన‌వ ట్రయ‌ల్స్ జ‌రుగుతున్నాయని ఆయ‌న వెల్లడించారు. ఢిల్లీలోని ఐసీఎంఆర్‌ కార్యాలయంలో సోమవారం (సెప్టెంబర్ 28) జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విధంగ చెప్పారు.

vaccine came in next six months
vaccine came in next six months

ఏదో ఒక రోజు కరోనాపై తప్పక విజయం సాధిస్తామని మంత్రి హర్షవర్ధన్ విశ్వాసం వ్యక్తం చేశారు. వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకకుంటే.. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌, వ్యాప్తి ఉద్ధృతి క్రమంగా తగ్గుతుందని చెప్పారు. దేశంలో మొత్తం 3 వ్యాక్సిన్లకు సంబంధించి ప్రయోగ పరీక్షలు వివిధ దశల్లో ఉన్నాయని.. వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లో ఎప్పుడైనా టీకా అందుబాటులోకి వస్తుందనే విశ్వాసంతో ఉన్నట్లు మంత్రి తెలిపారు.

వ్యాక్సిన్లకు సంబంధించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌ను మంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు. ఈ పోర్టల్‌లో కరోనా వ్యాక్సిన్‌ పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఐసీఎంఆర్‌ వందేళ్ల టైమ్‌ లైన్‌ను విడుదల చేయడం గర్వంగా ఉందని చెప్పారు. భావితరాల శాస్త్రవేత్తలకు ఐసీఎంఆర్‌ ప్రేరణగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.