Almonds: నేటి రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు బలవర్ధకమైన ఆహారం మాత్రమే కాదు.. డ్రైఫ్రూట్స్ కూడా ఎక్కువ తినమని సలహా ఇస్తున్నారు ఆహార నిపుణులు. దీంతో డ్రైఫ్రూట్స్ తీసుకుంటున్నవారి సంఖ్య పెరిగింది. వీటికోసమే ప్రత్యేకంగా స్టాల్స్ కూడా వెలిశాయి. ఈ డ్రైఫ్రూట్స్ లో ఒకటి బాదం ఒకటి. వీటివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే నానబెట్టిన బాదం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా బాదం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
బాదం పప్పు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆహార నిపుణులు అంటున్నారు. జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు ఇతరత్రా ఆహారం కంటే బాదంపప్పు ఉత్తమమని అంటున్నారు. బాదంపప్పు వల్ల పిల్లలకు మాత్రమే కాదు.. పెద్దల జ్ఞాపకశక్తి కూడా పెంచుతుందని అంటున్నారు. దీంతో అన్ని వయసుల వారికీ బాదం మేలే చేస్తుందని అంటున్నారు. బాదంపప్పు మనకు పచ్చిగా లభిస్తుంది. వాటిని అలానే తినడం కంటే నానబెట్ట తినడం ఆరోగ్యానికి మంచిది. అయితే.. బాదంపప్పును స్నాక్స్ లా ఎప్పుడు పడితే అప్పుడు తినడం కంటే ఒక నిర్ధిష్ట సమయంలో తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.
రాత్రి సమయంలో కప్ నీళ్లలో బాదంపప్పు నానబెట్టి.. ఉదయం టిఫిక్ చేసే సమయం ముందే తినడం చాలా మంచింది. దీని ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అలా తినడం వల్ల వీటిని జీర్ణించుకోవడం సులభమవుతుంది. ఇది శరీరంలోని ఎంజైమ్‌ల ఉత్పత్తిని కూడా పెంచుతుంది. దీంతో జీర్ణవ్యవస్థతను మెరుగుపరుస్తుంది. నానబెట్టిన బాదంపప్పులో ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, విటమిన్లు ఉంటాయి. బాదంపప్పు రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
డయాబెటిస్ బాధితులకు కూడా నానబెట్టిన బాదం చాలా మంచిది. నానబెట్టిన బాదంపప్పులో ఉండే విటమిన్ ఈ ఎంతో లాభం. ముఖ్యంగా చర్మం, జుట్టు లాభం చేకూరుస్తుంది. చర్మ సౌందర్యానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి, జుట్టు రాలకుండా ఉండేందుకు సాయపడుతుంది. రోజూ రాత్రిపూట నాలుగైదు బాదం గింజల్ని నానబెట్టి ఉదయాన్నే వాటి పైన తొక్క తీసి తింటే చాలు. మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాం.