పసుపు.. ఇది లేనిదే కూర రుచి ఉండదు. రోజూవారి ఆహారంలో పసుపు కంపల్సరీ ఉండాల్సిందే. అది ఏ కూర అయినా పసుపు లేనిదే కూర వండం. పసుపు అంతలా మన జీవితంలో భాగం అయిపోయింది. అంతేనా.. మనకు ఎక్కడైనా గాయం అయినా ముందుగా మనం ఆ గాయానికి పెట్టేది పసుపు. పసుపు పెట్టాకనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. అంతేనా.. చాలామంది పసుపును పాలల్లో కూడా వేసుకొని తాగుతారు. వామ్మో… ఒకే పసుపును మనం ఇన్ని రకాలుగా వాడుతున్నామా? కూరల్లో పసుపు వేసుకోవడం ఓకే.. ఏదైనా గాయం అయితే పసుపు పెట్టడం ఓకే.. మరి.. పాలల్లో పసుపు వేసుకొని తాగడం వెనుక ఉన్న స్టోరీ ఏంది? దాంట్లో ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? తెలుసుకుందాం పదండి..
పసుపు అంటే ఔషధాల గని. పసుపు అంత మంచిది ఇంకోటి ఉండదు. అది మనిషికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే మనం దాన్ని ప్రతి కూరలో వేసుకొని తింటాం. పసుపులో కర్కుమిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. అదే అన్ని రకాలుగా మనకు ఉపయోగపడేది.
అయితే.. ఈ కర్కుమిన్ ను డైరెక్ట్ గా తీసుకుంటే వచ్చే లాభం ఏం ఉండదు. అందుకే పసుపును మనం కూరల్లో వేసుకొని తింటాం. అప్పుడు మాత్రమే దాని వల్ల ప్రయోజనం ఉంటుంది. పసుపులో ఎక్కువగా ఉండే కర్కుమిన్ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఊబకాయంతో బాధపడుతున్న వాళ్లు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు, హైపర్ లిపిడిమియా, మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవాళ్లకు పసుపులో ఉండే కర్కుమిన్ వల్ల లాభం ఉంటుంది.
అలాగే.. పాలల్లో కూడా పసుపును వేసుకొని తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. పైన చెప్పిన సమస్యలకు చెక్ పెట్టాలంటే పసుపును కూరల్లో కానీ.. పాలల్లో కానీ వేసుకొని తాగితే ప్రయోజనం ఉంటుంది.