Kiwi Fruit: కివీ పండు తింటే కలిగే లాభాలు తెలిస్తే వెంటనే కొనుక్కొని తినేస్తారు

health benefits of kiwi fruit

కివీ ఫ్రూట్. దీన్ని మన దగ్గర సపోటాతో పోల్చుతుంటాం. నిజానికి.. కివీ పండుకు సపోటాకు ఏమాత్రం కూడా సంబంధం లేదు. అది వేరు.. ఇది వేరు.. అయితే కివీ ఫ్రూట్.. మన దగ్గర పండదు. దీన్ని ఇండియాలో పండించరు. న్యూజిలాండ్ లో పండిస్తారు. కాకపోతే.. ఇండియాలో ఈ పండుకు గిరాకీ ఎక్కువ. అందుకే.. దీన్ని న్యూజీలాండ్ నుంచి ఇండియా దిగుమతి చేస్తుంటారు.

health benefits of kiwi fruit
health benefits of kiwi fruit

ఏ పండును కూడా మనం గింజలతో సహా తినం. కానీ.. కివీ ఫ్రూట్ ను గింజలతో సహా.. పొట్టుతో సహా తినేస్తాం. ఈ పళ్లంటే ఇండియాలో క్రేజ్. అయితే.. ఈ పండ్ల వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అసలు.. ఈ పళ్లు తింటే కలిగే లాభాలు తెలిస్తే వెంటనే మీరు కూడా కొనుక్కొని తినేస్తారు.

ఒక్కసారి దీని చరిత్ర తెలుసుకుంటే.. ఇది నిజానికి పుట్టింది న్యూజిలాండ్ లో కాదు. చైనాలో. అక్కడి నుంచి ఇది న్యూజిలాండ్ వెళ్లింది. తర్వాత న్యూజిలాండ్ దేశపు ప్రూట్ గా మారిపోయింది. అందుకే ఎక్కువగా న్యూజిలాండ్ వాళ్లను కివీస్ అంటారు. క్రికెట్ లోనూ మనం ఈ మాట వింటుంటాం.

నిజానికి.. ఈ పండు అంతగా పులుపు ఉండనప్పటికీ.. నిమ్మకాయ కంటే ఎక్కువ విటమిన్ సీ ఈ పండులోనే ఉంటుంది. అంటే.. ఒక్క కివీ ఫ్రూట్ తింటే.. మన శరీరానికి కావాల్సినంత విటమిన్ సీ లభిస్తుంది. ఇక ఈ పండులో పోషకాలు ఎక్కువ.. కేలరీలు తక్కువ.

వెయిట్ తగ్గాలనుకునే వాళ్లకు ఈ పండు ఔషధంలా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లు ఈ పండును రోజూ తింటూ ఉంటే.. ఇందులో ఉన్న పోషకాలు చెడు కొవ్వును కరిగిస్తాయి. విటమిన్ కే, ఈ కూడా ఈ పండులో ఉంటాయి. పొటాషియం, ఫోలేట్ లాంటి ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

దీంట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దాని వల్ల జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. మలబద్ధకం తగ్గుతుంది. అస్తమా కూడా తగ్గుతుంది. చర్మం పాడవకుండా ఉండాలంటే కివీని రోజూ తినాలి. దీని వల్ల చర్మం మెరుస్తుంది. దీంతో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. ఈ పండును తరుచుగా తీసుకుంటూ ఉంటే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.