టీ లేదా చాయ్ లేదా తేనీరు.. పేరు ఏదైనా దీనికి ఉన్న డిమాండే వేరప్పా. మామూలుగా కాదు. పొద్దున లేస్తే చాయ్.. పొద్దున నుంచి రాత్రి పడుకునే లోపు ఓ మూడు నాలుగు కప్పుల చాయ్ తాగనిదే రోజు గడవదు కొందరికి. ఎక్కడికెళ్లినా ముందు చాయ్. ఆఫీస్ లో చాయ్. చుట్టాలింటికి వెళ్తే చాయ్.. ఇలా మన జీవితంలో చాయ్ ఓ భాగం అయిపోయింది.
నిజానికి రోజూ ఓ కప్పు చాయ్ తాగితే మంచిదే. పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం ఉండవు. కానీ.. కొందరు చాయ్ లో చక్కెర బదులు బెల్లం వేసుకొని తాగుతుంటారు. చక్కెర కన్నా బెల్లం వేసుకొని చాయ్ చేస్తే.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.
మరి.. చాయ్ లో బెల్లం వేసుకొని తాగితే ఏమౌతుంది. చాలామంది బెల్లం వాడరు. చక్కెరనే ఎందుకు వేసుకొని తాగుతారో ఇప్పుడు తెలుసుకుందాం రండి..
అయితే.. చాయ్ లో చక్కెర వేసుకొని తాగడం వల్ల అనర్థాలే ఎక్కువ. ఎందుకంటే.. చక్కెరలో ఉన్న క్యాలరీలు.. శరీరంలో పేరుకుపోయి కొవ్వు ఎక్కువవుతుంది. దాని వల్ల అతిగా బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.
అందుకే.. కొందరు చక్కెర బదులు చాయ్ లో బెల్లం కలుపుకొని తాగుతారు. దాని వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ తక్కువ ఉన్నవాళ్లు… రక్తహీనత ఉన్నవాళ్లు… రక్తం సరఫరా సరిగ్గా జరగాలనుకునే వాళ్లు.. హైబీపీని తగ్గించుకోవాలనుకునే వాళ్లు.. టీలో చక్కెర బదులు బెల్లం కలుపుకొని తాగండి. దాని వల్ల ఐరన్ శరీరంలో చేరడంతో పాటు.. రక్త హీనత కూడా తగ్గుతుంది.
మలబద్ధకంతో బాధపడేవాళ్లు కూడా ఎక్కువగా బెల్లం చాయ్ ని తాగితే.. ఆ సమస్య పోతుందట. జీర్ణక్రియ సక్రమంగా జరగడంతో పాటు.. అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయట.
చాయ్ లో బెల్లంతో పాటు కాసింత అల్లం, మిరియాలు వేసుకొని తాగండి.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు.. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. కరోనా సమయంలో చాలామంది మిరియాలు, అల్లంతో చేసిన చాయ్ ని తాగుతున్నారు. దాంట్లో కాసింత బెల్లం వేసుకుంటే చాలు.. కరోనా రమ్మన్నా రాదు.
బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.. దీని వల్ల మన శరీరంలో వచ్చే ఫ్రీరాడికల్స్ ను ఈ చాయ్ తాగడం వల్ల తొలగించుకోవచ్చు.
వామ్మో.. బెల్లం చాయ్ తాగడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? అని నోరెళ్లబెట్టకండి.. ఈరోజు నుంచి చాయ్ లో చక్కెర బదులు బెల్లం వేసుకొని తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..