ప్రస్తుతం మనం కరోనా కాలంలో ఉన్నాం. ఈ సమయంలో కరోనాను ఎదుర్కోవాలంటే మనకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువుండాలి. లేదంటే కరోనా అటాక్ చేసేస్తుంది. మన బాడీలో రోగ నిరోధక శక్తి తక్కువైతే చాలు.. కరోనా దాడి చేసేస్తుంది. అందుకే.. ప్రస్తుతం చాలామంది కరోనాను ఎదుర్కోవడం కోసం రోగనిరోధక శక్తిని పెంచుకుంటున్నారు.
ఒక్క కరోనానే కాదు.. ఇతర రకాల వైరస్ లు, ఫ్లూలు కూడా దరిచేరకూడదంటే ఖచ్చితంగా కొన్ని పళ్లను తినాల్సిందే. వాటిని మన రోజూవారి ఆహారంలో చేర్చుకోవాల్సిందే.
అలాంటి పళ్లలో ముఖ్యమైనవి జామపళ్లు. అవును.. ఇవి సీజనల్ ఫ్రూట్స్ ఏమీ కావు. అన్ని కాలాల్లో జామపళ్లు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఇంకా ఎక్కువగా మార్కెట్ లో కనిపిస్తుంటాయి జామపళ్లు.
జామపళ్లు ఎంత రుచిగా ఉంటాయో.. వాటిలో అన్ని సుగుణాలు కూడా ఉంటాయి. జామపండులో ముఖ్యంగా విటమిన్ సి ఉంటుంది. యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల శరీరంలో ఉన్న ఫ్రీరాడికల్స్ తొలగిపోతాయి.
చలికాలంలో ఎక్కువగా జామపండును తీసుకోవడం వల్ల.. చలికాలం వల్ల వచ్చే ఎన్నే రకాల ఫ్లూ వైరస్ లను అరికట్టవచ్చు. పీచుపదార్థం కూడా జామపండులో ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల గుండె సంబంధిత వ్యాధులు రావు. రక్తంలో షుగర్ లేవల్ ను కూడా జామ పండు నియంత్రిస్తుంది.