మెగా ఫ్యామిలీలో అతనికి మాత్రమే టాలెంట్ ఉంది.. అందరూ నాశనం అవుతారు: శ్రీ రెడ్డి

ఈ మధ్యకాలంలో శ్రీ రెడ్డి వంట వీడియోలతో ఎంతో బిజీగా ఉంటూ ఎన్నో రకాల వంటలను చేస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నరేష్, పవిత్ర లోకేష్ వివాదం రోజు రోజు ముదిరిపోతుంది ఈ క్రమంలోనే ఈ వివాదంపై శ్రీ రెడ్డి స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశారు. నరేష్ పవిత్ర లోకేష్ ఎవరితోనైనా అపవిత్ర బంధాలు పెట్టుకోవచ్చు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అదేవిధంగా నరేష్ భార్య రమ్య గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేముంది? ఆమెను ప్రశ్నించాల్సిన పని నీకు లేదు? ఇలా ఎంతమంది జీవితాలలో నిప్పులు పోస్తావు అంటూ పవిత్ర లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో మీటు ఉద్యమం ద్వారా మేము పోరాటం చేస్తే పవిత్ర మాకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ సమయంలో నరేష్ మమ్మల్ని నాలుగు సంవత్సరాల పాటు మా అసోసియేషన్ లో బ్యాన్ చేశారు.ఇక కాస్టింగ్ కౌచ్ గురించి ఎవరైనా ఎదురు మాట్లాడితే వారి సినిమాలను అట్టర్ ఫ్లాప్ చేస్తారు. ఈ విధంగా నన్ను ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ తోక్కేసిందని నాకు సినిమా అవకాశాలు రాకుండా చేశారంటూ శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా ఫ్యామిలీలో ఎవరికి టాలెంట్ లేదని అందుకే అక్కడే పడి ఉన్నారని ఈమె తెలిపారు.

మెగా ఫ్యామిలీలో కేవలం అల్లు అర్జున్ మాత్రమే తన టాలెంట్ తో పైకి వచ్చారని శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ అవకాశాన్ని కూడా నాకు రాకుండా చేశారు. అప్పుడు నేను చేసిన ఉద్యమానికి ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి నేను ఎప్పుడూ ఓడిపోలేదు. ఇక నన్ను ఎవరైతే బాధ పెట్టారో వారందరూ కూడా నాశనం అవుతారు.ఒకానొక సమయంలో నేను ఎంత బాధ పడ్డానో ఎంత ఏడ్చానో నా దిండుకు మాత్రమే తెలుసు అంటూ ఈ సందర్భంగా శ్రీ రెడ్డి గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.