కొందరికి కొన్ని వింత వింత అలవాట్లు ఉంటాయి. అది వారు చేసే పనిలో అయినా కానీ వారు తినే పదార్థాలు అయినా కానీ ఉంటుంది. అలా ఓ వ్యక్తికి కూడా ఇసుక తినే అలవాటు ఉందట. అది కూడా ప్రతి రోజు ఇసుక తింటాడట.
ఉత్తరప్రదేశ్లోని అరంగాపూర్ కు చెందిన హరిలాల్ అనే ఓ వలస కూలి వ్యక్తి. ఇతడు ఒడిసాలోని భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తుంటాడు. ఇతడు 40 ఏళ్లుగా రోజు ఇసుక తింటాడట. భోజనం ముందు లేదా భోజనం చేసిన తర్వాత ఇసుక తినే అలవాటు ఉందట. చిన్నప్పుడు తాను నదికి వెళ్ళినప్పుడు కూడా రోజు ఇసుక తినేవాడిని అని అన్నాడు అతడు. ఇక దీని వల్ల అతనికి ఆరోగ్య సమస్యలు లేవని అన్నాడు.