Devotional Tips: సాధారణంగా శంఖాన్ని చాలామంది ఒక అలంకరణ వస్తువుగా ఉపయోగిస్తారు. కానీ శంఖం సాక్షాత్తూ లక్ష్మీ దేవి స్వరూపం అని చాలా మందికి తెలియదు.లక్ష్మీదేవితో పాటు శంఖం కూడా క్షీరసాగర మధనం చేస్తున్న సమయంలో సముద్రగర్భం నుంచి పుట్టింది కనుక శంఖాన్ని లక్ష్మీదేవితో సమానంగా భావించి పూజ చేస్తారు.అయితే చాలామంది ఇంట్లో శంఖం ఉన్నప్పటికీ ఆ శంఖానికి ఎలా పూజ చేయాలి అనే విషయం తెలియక సతమతమవుతుంటారు. ఈ క్రమంలోనే ఇంట్లో శంఖం ఉంటే ఆ శంఖాన్ని ఎలా పూజించాలి అనే విషయానికి వస్తే….
శంఖం ఎల్లప్పుడూ పూజ గదిలోనే ఉంచుకోవాలి. ఇలా తెల్లటి శంఖాన్ని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల సకల సంపదలు కలుగుతాయి.ఇక శంఖం ఎల్లప్పుడూ పూజగదిలో ఉండాలి అది కూడా ఒక వెండి ప్లేటులో బియ్యం పోసి ఆ బియ్యంలో శంఖం ఉంచాలి. అలాగే ప్రతి శుక్రవారం అమావాస్య పౌర్ణమి రోజు పసుపు నీటితో శుభ్రం చేసి అనంతరం పాలాభిషేకం చేసి పసుపు కుంకుమతో శంఖాన్ని పూజించాలి.
ఈ విధంగా మన ఇంట్లో ఉన్న శంఖానికి ప్రతి రోజు పూజ చేస్తూ వారం వారం ప్రత్యేకంగా శుభ్రం చేసి పూజ చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. శంఖం లక్ష్మీ దేవి స్వరూపం కనుక మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, సకల సంపదలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు. అయితే తెలుపురంగు శంఖాన్ని ఇంట్లో పెట్టి పూజించడం వల్ల శుభం కలుగుతుంది.