AP: ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఇలా కూటమి పార్టీలు అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు అధికారులు అందరికీ కూడా ఎమ్మెల్యేలకు కూడా తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా చాలా నిబద్ధతతో పని చేయాలని ఆశ మాసిగా ఉంటే 95 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు అంటూ అందరికీ వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా అధికార దుర్వినియోగం చేస్తే అసలు సహించడానికి కూడా ఈయన తెలిపారు.
ఇలాంటి సమయంలోనే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా జీవి రెడ్డి జగన్ హయాంలో ఫైబర్ నెట్ లో జరిగిన అవకతవకలు, అక్రమాలను బయటపెట్టారు. అడ్డగోలు నియామకాలతో అప్పనంనగా ప్రభుత్వం నుంచి వేతనాలు అందుకుంటున్న 400 మందిని వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో జీవి రెడ్డి ఒక్కసారిగా హీరోగా మారిపోయారు.
ఇక జీవి రెడ్డి ఇలాంటి ఆదేశాలు జారీ చేసే నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో అసహనానికి గురైన జీవి రెడ్డి ఈ విషయాన్ని సంబంధిత మంత్రి దృష్టికో, ముఖ్యమంత్రి దృష్టికో తీసుకెడితే సరిపోయేదానికి ఆయన మీడియా సమావేశం పెట్టి ఫైబర్ నెట్ ఎండీపై రాజద్రోహం ఆరోపణలు చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు జీవీ రెడ్డిని గట్టిగా మందిరించడంతో ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేసేసారు.
ఇక ఈయన రాజీనామాతో తెలుగుదేశం సోషల్ మీడియాలో జీవీరెడ్డికి మద్దతుగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో చంద్రబాబు తీరు పట్ల అసంతృప్తి కూడా వ్యక్తం అవుతోంది.ఈ పరిస్థితి రావడానికి కారణం అధికారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పని చేయడంలో చూపుతున్న అలసత్వమే కారణమనడంలో అనుమానం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కనుక గమనిస్తే కూటమి పార్టీలు పేరుకే అధికారంలో ఉన్నారు కాని పాలన మాత్రం జగన్ నియంత్రణలో ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలోనే తెలుగుదేశం క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
2019 నుంచి 2024 మధ్య కాలంలో కీలక పోస్టులలో ఉన్న కొందరు అధికారులను అలాగే కొనసాగించడంతో, వారు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వానికి ఇబ్బందులు తీసుకురావడమే కాకుండా, పార్టీకీ, ప్రభుత్వానికీ మధ్య అగాధాన్ని సృష్టిస్తోందని ఈ విషయంపై చంద్రబాబు దృష్టి సారించాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ కూడా అధికారం బాబుది పాలన జగన్ దనీ భావించే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.