నారా లోకేశ్.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. తాజాగా నారా లోకేశ్ కు గుంటూరు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయన చేస్తున్న ట్వీట్లపై పోలీసులు షాక్ ఇచ్చారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఆయనకు పోలీసులు తెలిపారు.
దీనిపై పెద్ద రచ్చే జరుగుతోంది సోషల్ మీడియాలో. నారా లోకేశ్.. కులాలను రెచ్చగొట్టే విధంగా ట్వీట్లు చేస్తున్నారని.. గుంటూరు పోలీసులు ట్వీట్లు చేయడంతో.. ఆ ట్వీట్ కు నారా లోకేశ్ కూడా కౌంటర్ ఇచ్చారు.
గుంటూరు అర్బన్ ఎస్పీకి నిజంగా ధైర్యం ఉంటే పెదకాకాని పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ను బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు.. రాజకీయ నాయకులకు లొంగిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ దుయ్యబట్టారు.
నిజానికి నారా లోకేశ్ ఏం ట్వీట్ చేశారంటే.. ఒక వైసీపీ ఎమ్మెల్యే ప్రహారి గోడ ప్రారంభోత్సవానికి వెళ్లారట. దానిపై టీడీపీ కార్యకర్త మణిరత్నం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దానిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి…మణిరత్నాన్ని పోలీసులు అరెస్ట్ చేశారని నారా లోకేశ్ ట్విట్టర్ లో మండిపడ్డారు.
వైసీపీ నేతలు ఎలా ఆడమంటే.. పోలీసులు అలా ఆడుతున్నారని… అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని లోకేశ్ మండిపడటంతో.. దానిపై గుంటూరు ఎస్పీ నారా లోకేశ్ కు ట్వీట్ చేశారు.
పులివెందుల పిల్లి టిడిపి కార్యకర్తలను చూసి భయపడుతుంది.సగం గోడ కట్టి ఎమ్మెల్యే భారీ ప్రారంభోత్సవం చెయ్యడమే సిగ్గుచేటు.
గోడ గ్రాండ్ ఓపెనింగ్ ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినందుకు పొన్నూరులో టిడిపి కార్యకర్త మణిరత్నాన్ని పోలీసులు అక్రమ అరెస్టు చెయ్యడం…(1/2) pic.twitter.com/ZdCVkMhrjd— Lokesh Nara (@naralokesh) November 25, 2020