AP: ఏపీలో మరో కొత్త పథకం.. దానికోసం రూ.400 కోట్లు ఖర్చు!

AP: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రకాల ఆ పథకాలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే వాటీతో పాటు ఇప్పుడు మరో సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు ఇందుకు సంబంధించిన తాజాగా తెలిపారు. తాజాగా ఆయన తాడేపల్లి లోని కాపు కార్పొరేషన్‌ కార్యాలయంలో మాట్లాడుతూ ఈ సరికొత్త పథకం గురించి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాపు మహిళలకు ఆర్థిక చేయూత కోసం గృహిణి అనే పథకాన్ని తీసుకురావాలని కూటమి సర్కారు యోచిస్తోందని ఆయన చెప్పారు.

ఈ పథకం ద్వారా కాపు మహిళలకు రూ.15,000 ఇవ్వాలని కాపు సంక్షేమ కార్పొరేషన్‌ ప్రతి పాదనలు చేసిందని తెలిపారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి రూ.400 కోట్లు ఖర్చవుతాయని అంటోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం లోని సర్కారు కాపు సంక్షేమానికి రూ.4,600 కోట్లు కేటాయించిందని కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పుకొచ్చారు. దాని వల్ల సాధించిన ఫలితాలను ఏడాదిలో చూపిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ పథకాన్ని తొందరగా తీసుకురావాలన్న ఆలోచనలలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే గతంలో కూడా కాపు మహిళలకు పథకాలు అమలు చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌ కాపు నేస్తం పథకాన్ని అమలు చేసారు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ పథకం ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలకు ప్రతీ ఏటా రూ.15 వేల చొప్పున సహాయం అందించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేస్తోంది. అయితే త్వరలోనే కాపు మహిళకు ఆర్థిక చేయూతపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.