Gruhalakshmi: తన డాన్స్ తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన గృహలక్ష్మి సీరియల్..!

Gruhalakshmi: మా టీవీలో ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్న కస్తూరి ఇంట్లో మనిషిలా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. అన్నమయ్య వంటి పలు చిత్రాలలో నటించిన కస్తూరి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వివాహం తర్వాత సినిమాలకు కొంత కాలం దూరంగా ఉన్న కస్తూరి ప్రస్తుతం మాటీవీలో ప్రసారం అవుతున్న గృహలక్ష్మి సీరియల్ లో తులసి పాత్రలో నటిస్తోంది. ఈ సీరియల్ లో తల్లిగా, ఒక భార్యగా ఎంతో పద్ధతిగా ఉంటుంది.

సీరియల్ లో ఎప్పుడు ఏడుస్తూ సీరియస్ గా ఉండే తులసి ఇటీవల ఈటీవీలో ప్రసారమవుతున్న ” శ్రీదేవి డ్రామా కంపెనీ” అనే షో కి గెస్ట్ గా హాజరయ్యింది. ఈ షోలో కస్తూరి తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. సీరియల్ లో ఎంతో పద్ధతిగా ఉండే తులసి ఇలా స్టేజి మీద బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులేయడంతో అక్కడున్న వారందరూ కూడా ఈలలు వేస్తూ ఎంతో ఎంజాయ్ చేశారు. కస్తూరి ఇల కొత్త లుక్ తో కనిపిస్తూ డాన్స్ చేయడంతో ప్రేక్షకులు సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో పాటిస్పేట్ చేసిన కస్తూరి మాట్లాడుతూ” సీరియల్ లో ఎప్పుడు ఏడుస్తూ ఉండే వారందరిని ఇక్కడ నవ్వుతూ ఉండటం చూస్తున్న” అని అన్నారు. ఒకప్పుడు సినిమాలలో తన అందంతో అభిమానులను అలరించిన కస్తూరి ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో ఒక మధ్య తరగతి పాత్ర పోషిస్తూ తన అభినయంతో అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది.