బంజారాహిల్ల్స్ లో ఉద్రిక్తలు.. కూకట్ పల్లిలో కొట్లాట..మలక్ పేట్ లో ఆగిన పోలింగ్

minister puvvada ajay

 గ్రేటర్ మున్సిపల్ పోలింగ్ ఉదయం 7 గంటల నుండి ప్రారంభం అయ్యింది. అయితే పోలింగ్ శాతం చాలా మందకొడిగా సాగుతుంది. ఉదయం 11 గంటలకు కేవలం 8. 9 శాతం మాత్రమే నమోదు అయ్యింది. ఇక గ్రేటర్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న గొడవలు, ఉద్రిక్తలు జరిగాయి. బంజారాహిల్స్ ఎన్జీటీ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తలు జరిగాయి. బీజేపీ నేతలు కాషాయ మాస్క్లు ధరించారని తెరాస నేతలు, తెరాస నేతలు చేతికి గులాబీ కంకణాలు కట్టుకున్నారని బీజేపీ నేతలు ఆరోపణలు చేసుకున్నారు. దీనితో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరకొట్టారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తెరాస పార్టీ నేతల మీద రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి పిర్యాదు చేశారు .

minister puvvada ajay

తెరాస మంత్రి కారుపై దాడి

గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టటానికి డబ్బులు పంచుతున్నారు అనే ఆరోపణలు చేస్తూ తెరాస మంత్రి పువ్వాడ అజయ్ కారుపై బీజేపీ నేతలు దాడికి తెగబడ్డారు. కూకట్ పల్లి ఫోరమ్ మాల్ దగ్గర మంత్రి కారును అడ్డుకున్న బీజేపీ నేతలు, కారులో డబ్బులు తరలిస్తున్నారని గొడవకు దిగారు. మంత్రి సెక్యూరిటీ సిబ్బంది కారుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయటమే కాకుండా, తెరాస నేతలపై చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో రంగప్రవేశం చేసిన పోలీసులు మంత్రి కాన్వాయ్ ను సురక్షితంగా అక్కడ నుండి పంపించి వేశారు. ఈ క్రమంలో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది.

ghmc

ఓల్డ్ మలక్ పేట్ లో ఆగిన పోలింగ్

ఓల్డ్ మలక్ పేట్ డివిజన్ లోని 5 కేంద్రాల్లో పోలింగ్ నిలిపివేశారు అధికారులు. పార్టీ గుర్తులు తారుమారు కావటంతో 1,2,3,4,5 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఆపేశారు . బ్యాలెట్ పత్రంలో సీపీఐ అబ్యర్దికి ఎదురుగా సీపీఎం పార్టీ గుర్తుకు ముద్రించారు. కంకి కొడవలికి బదులుగా సుత్తి కొడవలి రావటంతో సిపిఐ పార్టీ ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు . దీనితో పోలింగ్ కు కాసేపు నిలిపివేశారు. అక్కడ జరిగిన పొరపాటుగా గుర్తించిన ఎన్నికల సంఘం ఆ డివిజన్ పరిధిలో సుమారు 69 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 3 వ తేదీన రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

 గ్రేటర్ వ్యాప్తంగా మరికొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు జరుగున్నాయి, నగర వ్యాప్తంగా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేయటం జరిగింది. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగిన నిముషాల వ్యవధిలో పోలీసు బలగాలు అక్కడికి చేరుకునే విధంగా ఏర్పాటు చేశారు . అయితే గ్రేటర్ పరిధిలో నమోదవుతున్న పోలింగ్ శాతమే ఆందోళన కలిగిస్తుంది . ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మరి ఎంత శాతం నమోదు అవుతుందో చూడాలి