కేసిఆర్ కి మరొక బ్యాడ్ న్యూస్ మోసుకొచ్చిన తమిళసై?

KCR special plan to for his third front

తమకు రాష్ట్రంలో తమను విమర్శించే నాయకులే లేరని అనుకుంటున్న తెరాస నేతలకు గవర్నర్ తమిళ సై షాక్ ఇచ్చారు. తెలంగాణ రాజకీయాలు మొత్తం ప్రస్తుతం తమిళ సై ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల చుట్టే తిరుగుతుంది.

కరోనా కట్టడిలో కేసీఆర్ ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించలేదని ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కరోనా ఉధృతిని సర్కార్ సరిగా అంచనా వేయలేకపోయిందని తమిళిసై వ్యాఖ్యానించారు. తాను రాసిన లేఖలకు కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదని తమిళిసై పేర్కొన్నారు. టెస్ట్ లు ఎక్కువ సంఖ్యలో జరగడం లేదన్న అభిప్రాయం నెలకొందన్నారు. ఈ వ్యాఖ్యలను గత కొన్ని రోజుల నుండి ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు చేస్తున్నవే. అయితే ఇప్పుడు గవర్నర్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రతిపక్షంలా అనిపించడంతో రాష్ట్రంలో చర్చలు స్టార్ట్ అయ్యాయి. గవర్నర్ వ్యాఖ్యల వెనక కూడా ఏదైనా రాజకీయ ఉద్దేశం ఉందా అని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న తమిళ సైను గవర్నర్ గా అనూహ్యంగా నియమించింది. ఇలా నియమించడం వెనక కూడా రాజకీయ ఉద్దేశం ఉందని అప్పట్లో చర్చలు కూడా జరిగాయి. ఈ వ్యాఖ్యలు నిజమన్నట్టుగానే తమిళిసై బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి కొంత దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. కరోనా సమయంలోనూ ఎమ్మెల్యేలు, మంత్రుల కంటే భిన్నంగా తమిళిసై ఆసుపత్రులను సందర్శించారు. వైద్యులలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా వైస్ ఛాన్సిలర్ లతో విద్యా విధానాలపై సమీక్షించారు. కరోనా తీవ్రత పెరిగిందని దాదాపు నాలుగైదు సార్లు తమిళిసై ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇవన్నీ కూడా గవర్నర్ ఒక ప్రతిపక్ష నేతగానే వ్యాఖ్యలు చేస్తున్నారని తెరాస నాయకులు చర్చించుకుంటున్నారు.

దీని అద్దం పడుతూ హుజుర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గవర్నర్ తీరును తప్పుపడుతూ ట్వీట్ చేసి ఆ తర్వాత తొలగించారు.గవర్నర్ వ్యాఖ్యలను చూసైనా ప్రభుత్వం కరోనా విషయంలో తప్పులు సరిదిద్దుకోవాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు సూచిస్తున్నారు. అయితే గవర్నర్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా తీసుకోవాలా లేక బాధ్యతాయుతంగా చేసిన వ్యాఖ్యలుగా తీసుకోవాలో తెలియక సీఎం కేసీఆర్ తలపట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గవర్నర్ రూపంలో కేసీఆర్ కు కొత్త సమస్య వచ్చింది.